Saturday, March 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమల్లేశ్వరి మృతికి మంత్రి వాకిటి శ్రీహరి సంతాపం

మల్లేశ్వరి మృతికి మంత్రి వాకిటి శ్రీహరి సంతాపం

- Advertisement -

పశు సంవర్థక శాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ మృతి బాధాకరం : జీఎంపీఎస్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్ర పశుసంవర్ధక శాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సీహెచ్‌.మల్లేశ్వరి ఆకస్మిక మృతి పట్ల రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి సంతాపం ప్రకటించారు. ఆమె మరణ వార్త తెలుసుకున్న మంత్రి శ్రీహరి హైదరాబాద్‌ నానకరామ్‌ గూడ స్పర్శ్‌ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ ఆమె భౌతిక కాయాన్ని సందర్శించి నివాళి అర్పించారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె సుధీర్ఘకాలంగా పశుసంవర్థక శాఖలో సేవలు అందిస్తున్నారని గుర్తుచేశారు.

ప్రస్తుతం ఆమె రాష్ట్ర అడిషనల్‌ డైరెక్టర్‌తో పాటు రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థకు ఇన్‌చార్జి సీఈఓగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. పశుసంవర్థక శాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సీహెచ్‌.మల్లేశ్వరి మృతి అత్యంత బాధాకరమని గొర్రెలు, మేకల పెంపకం దార్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె మరణం వారి కుటుంబానికే కాకుండా రాష్ట్రంలోని గొర్రెల పెంపకం దారులకు, పాడి రైతులకు తీరని లోటు అని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -