Saturday, March 7, 2026
E-PAPER
Homeబీజినెస్పోర్టుల నుంచి కంటైనర్లు వెనక్కి

పోర్టుల నుంచి కంటైనర్లు వెనక్కి

- Advertisement -

భారత ఎగుమతిదారుల నిర్ణయం

ముంబయి : అమెరికా, ఇజ్రాయిల్‌ నిరంకుశ చర్యలతో ఇరాన్‌పై ఏకపక్ష దాడులు పెరుగుతోన్న నేపథ్యంలో సముద్ర మార్గాలు మూసుకుపోవడంతో భారత ఎగుమతి రంగం తీవ్ర సంక్షోభంలోకి జారుకుంటోంది. దేశీయ ఓడరేవుల్లో సుమారు 38,000 కంటైనర్లు నిలిచిపోగా, అటు సరుకు పంపలేక, ఇటు పోర్టుల్లో పెరుగుతున్న భారీ అద్దెలు, షిప్పింగ్‌ సర్‌చార్జీలను భరించలేక ఎగుమతిదారులు దాదాపు 19,000 కంటైనర్లను బ్యాక్‌ టు టౌన్‌ దరఖాస్తుల ద్వారా వెనక్కి రప్పించుకుంటున్నారు. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, బాస్మతి బియ్యం వంటి త్వరగా పాడైపోయే వస్తువులను దేశీయ మార్కెట్లలోనే విక్రయించేందుకు సిద్ధమవుతుండటంతో స్థానికంగా వీటి ధరలు తగ్గే అవకాశం ఉండటంతో ప్యాకెజింగ్‌, రవాణా ఖర్చుల రూపంలో వ్యాపారులు భారీ నష్టాలను చవి చూస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -