ఇజ్రాయిల్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు
టెలిఅవీవ్: పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్‌పై ఇజ్రాయిల్, అమెరికా దాడులు కొనసాగుతుండగా, ఆ దేశ మాజీ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీని హతమార్చే లక్ష్యాన్ని గత ఏడాది నవంబర్లోనే నిర్ణయించినట్టు ఇజ్రాయిల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ వెల్లడించారు. ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూతో కలిసి జరిగిన అత్యంత రహస్య భద్రతా సమావేశంలో ఆ లక్ష్యాన్ని నిర్ణయించినట్టు ఆయన పేర్కొన్నారు.
ముందస్తు చర్యలు తీసుకున్నాం
మొదట ఆ ఆపరేషన్‌ను 2026 మధ్యలో అమలు చేయాలని భావించినప్పటికీ, ఇరాన్లో నెలకొన్న అంతర్గత అస్థిరత కారణంగా దాడి సమయాన్ని ముందుకు జరిపినట్లు తెలిపారు. జెరూసలేం పోస్ట్ నివేదిక ప్రకారం, ఈ వ్యూహాన్ని అమెరికాతో కూడా పంచుకున్నట్టు కాట్జ్ తెలిపారు. ఇరాన్లో మతపెద్దల పాలనపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో వారు ఇజ్రాయిల్, అమెరికా లక్ష్యాలపై దాడులకు దిగే అవకాశముందని భావించి ముందస్తు చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు.
ఇజ్రాయిల్ చేపట్టిన ఆపరేషన్ రోరింగ్ లయన్, ఎపిక్ ఫ్యూరీ ప్రారంభ దశలోనే ఈ లక్ష్యాన్ని అమలు చేసినట్టు సమాచారం. ఒక సార్వభౌమ దేశ అత్యున్నత నాయకుడిని వైమానిక దాడి ద్వారా హతమార్చడం ఇదే మొదటిసారి అని అంతర్జాతీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇజ్రాయిల్ మాత్రం ఈ చర్యను సమర్థించుకుంటోంది. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమం, అణు కార్యక్రమం తమ దేశానికి అస్తిత్వ ముప్పుగా మారిందని చెబుతోంది. అందుకే ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని పూర్తిగా బలహీనపరచడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొంది.
‘ఖమేనీ హత్యకు నవంబర్లోనే స్కెచ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



