Saturday, March 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకడసారి తండ్రిని చూసేందుకు..

కడసారి తండ్రిని చూసేందుకు..

- Advertisement -

ఇబ్బందుల మధ్య స్వగ్రామానికి చేరుకున్న కోడిచర్ల వాసి
రూ.లక్షా 70వేలు ఖర్చు
నవతెలంగాణ-మెండోర

కన్న తండ్రి మృతిచెందడంతో తండ్రిని కడసారి చూసుకోవడానికి కొడుకు రష్యా నుంచి ఇండియాకు రావడానికి రూ.లక్షా 70వేలు వెచ్చించాల్సి వచ్చింది. వివరాలలోకి వెళితే.. నిజామాబాద్‌ జిల్లా మెండోర మండలం కోడిచర్ల గ్రామానికి చెందిన పెంట సాయన్న అనే వ్యక్తి బుధవారం సాయంత్రం ఓ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. మృతుని కొడుకు అయిన నరేష్‌ బతుకుదెరువు కోసం రష్యాకు వెళ్లాడు. తండ్రి మరణవార్త వినగానే పుట్టెడు ద్ణుఖంతో ఉన్న నరేష్‌ ఎలాగైనా తండ్రిని చివరిసారి చూడాలనుకున్నాడు.

ఇజ్రాయిల్‌, ఇరాన్‌ యుద్ధాల నేపథ్యంలో విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ఎన్నో ఇబ్బందుల మధ్య రూ.1.70లక్షలు వెచ్చించి విమాన టికెట్‌ కొనుక్కుని ఇండియాకు శుక్రవారం వచ్చి కన్న తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యాడు. పేదరికంతో కొట్టుమిట్టాడుతూ పొట్టకూటి కోసం రూ.లక్షలు పెట్టి విదేశాలకు వెళితే.. యుద్ధాల నేపథ్యంలో మళ్లీ లక్షలు వెచ్చించి ఇండియాకు రావాల్సి వస్తుందని, ఇలా అయితే పేదరికం నుంచి బయట పడేదెన్నడని ప్రజలు వాపోతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో విదేశాల నుంచి ఇండియాకు వచ్చే వారికి ప్రభుత్వాలు అండగా ఉండాలని ప్రజలు ప్రాధేయపడుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -