Saturday, March 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమహిళా కాంగ్రెస్‌ నూతన రాష్ట్ర అధ్యక్షులుగా ఎర్రబెల్లి స్వర్ణ

మహిళా కాంగ్రెస్‌ నూతన రాష్ట్ర అధ్యక్షులుగా ఎర్రబెల్లి స్వర్ణ

- Advertisement -

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షులుగా ఎర్రబెల్లి స్వర్ణ నియమితులయ్యారు. ఈమేరకు శుక్రవారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 1985లో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఆమె… వరంగల్‌ జిల్లా పార్టీలో వివిధ హోదాలో బాధ్యతలు నిర్వహించారు. వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ డివిజన్‌ కార్పొరేటర్‌గా, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌గా, ఉమ్మడి రాష్ట్రంలో ఏపీసీసీ సభ్యులుగా, మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, వరంగల్‌ పడమర నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులుగా పని చేశారు. రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రలో పాల్గొన్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజాసంక్షేమ కార్యక్రమాలను, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆమె క్రియశీలంగా వ్యవహరిస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -