Saturday, March 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంటోలిచౌకి బాధితులకు రూ.కోటి పరిహారమివ్వాలి

టోలిచౌకి బాధితులకు రూ.కోటి పరిహారమివ్వాలి

- Advertisement -

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

అది ప్రమాదం కాదనీ, ప్రభుత్వ వ్యవస్థలు చేసిన హత్య అని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ విమర్శించారు. హైదరాబాద్‌ టోలిచౌకి నిజాం కాలనీలో జరిగిన ఘోర భవన ప్రమాదం బాధితులకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి శుక్రవారం ఆయన లేఖ రాశారు. కూలీ పనుల కోసం పొరుగు రాష్ట్రం నుంచి వచ్చిన ఈ అభాగ్యులకు ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా?అని ప్రశ్నించారు. పాతబడిన వెదురు బొంగులు, కనీస రక్షణ కవచాలు లేని ఆ డెత్‌ ట్రాప్‌లో వారిని బలిపశువులను చేశారని తెలిపారు. జీహెచ్‌ఎంసీ అధికారుల అండతోనే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

మూడు అంతస్తులకు అనుమతి తీసుకుని ఏడు అంతస్తుల నిర్మాణం చేపట్టారనీ, అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ ప్రమాదం వెనుక అవినీతి నెట్‌వర్క్‌ ఉందని తెలిపారు. డిసెంబర్‌లోనే నోటీసులు ఇచ్చామని చెప్తున్న అధికారులు, క్షేత్రస్థాయిలో నిర్మాణాన్ని ఎందుకు ఆపలేదని ప్రశ్నించారు. అధికారుల అండదండలు లేకపోతే ఇంత సాహసం బిల్డర్‌ ఎలా చేస్తారని అడిగారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. బిల్డర్‌ సులేమాన్‌, సైట్‌ సూపర్‌వైజర్‌ నాజర్‌లపై కఠినమైన సెక్షన్ల కింద కేసు క్రిమినల్‌ కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -