నవతెలంగాణ – జుక్కల
మాదిగ ఎంప్లాయిస్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణను రాష్ట్రంలో అమలు చేస్తున్న సందర్భంగా శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును దేశంలో అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు.
ఎస్సీ వర్గీకరణ పోరాటం సుదీర్ఘంగా సాగిందన్నారు. రాజకీయంగా ఎంతో ఒత్తిడి ఉన్నా రాష్ట్రంలో వర్గీకరణ అమలు చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, వేముల వీరేశం, కాలే యాదయ్య, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం, ప్రొఫెసర్ ఖాసీం తదితరులు పాల్గొన్నారు.



