Saturday, March 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కోర్టు భవనానికి ప్రభుత్వ స్థలం కేటాయించాలి 

కోర్టు భవనానికి ప్రభుత్వ స్థలం కేటాయించాలి 

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు టౌను
ఆలేరు పట్టణంలో  కోర్టు భవనం నిర్మాణం కొరకు వెంటనే ప్రభుత్వ స్థలన్ని రెవెన్యూ అధికారులు కేటాయించాలని, ఆలేరు బార్ సోసియేషన్ సభ్యులు కోరారు. కోర్టు కొరకు కేటాయించిన భూమి సర్వేనెంబర్  1026, 10 33, 1034 లో కొత్త చెరువు  చేలక విచారణలో ఉన్నందున, వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు.

కొత్తచెరువు స్థలం విచారణలో ఉన్నందున వెంటనే మరొక స్థలాన్ని రెవెన్యూ అధికారులు చూపాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే కోర్టు  స్థలంపై సమగ్ర విచారణ జరిపి సమస్యను పరిష్కరించాలని కోరారు. తాసిల్దార్ ఆంజనేయులుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో లాయర్లు ప్రసాద్, స్వామి , శ్రీనివాస్, న్యాయవాదులు  తదితరులు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -