నవతెలంగాణ – హైదరాబాద్: గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేసిన విషయం తెలిసిందే. తాజాగా గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ క్షమాపణలు చెప్పారు. ఇరాన్ మీడియాలో మాట్లాడుతూ.. ఇరాన్‌కు ఆయా దేశాలపై దాడులు చేసే ఉద్దేశం లేదన్నారు. ఇరుగు దేశాలు తమపై దాడి చేయకుంటే ఇరాన్ సైతం దాడి చేయదన్నారు. తాత్కాలిక నాయకత్వమైన కౌన్సిల్ నిన్న ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఇక నుంచి గల్ఫ్ దేశాలపై దాడులు చేయమన్నారు. అలాగే యుద్ధం నేపథ్యంలో ఇరాన్ బేషరతుగా లొంగిపోవాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, పెజెష్కియాన్ దీన్ని తోసిపుచ్చారు. ఇరాన్‌ను లొంగదీసుకోవాలన్న కలలను వారు సమాధి చేసుకోవాల్సిందేనని వ్యాఖ్యానించారు.
గల్ఫ్ దేశాలకు క్షమాపణ చెప్పిన ఇరాన్ అధ్యక్షుడు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



