Saturday, March 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళ ప్రగతిని వివరించి పెంపొందించాలి

మహిళ ప్రగతిని వివరించి పెంపొందించాలి

- Advertisement -

సంజనా రెడ్డి సప్పిడి, ఉప సర్పంచ్ పసర పంచాయితీ 
నవతెలంగాణ – గోవిందరావుపేట 

నేటి రంగంలో మహిళలు సాధిస్తున్న ప్రగతిని ముందు తరాలకు వివరిస్తూ పురోగతిని పెంపొందించాలని పసర గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ సప్పిడి సంజన రెడ్డి అన్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నవ తెలంగాణతో మాట్లాడారు. ముందుగా మండల ప్రజానీకానికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రస్తుతం మహిళలు అన్ని రంగాలలో అద్భుతంగా ప్రతిభను కనబరిచి రాణిస్తున్నారని అన్నారు. ప్రముఖులైన వారిని వారి కుటుంబ నేపథ్యము రాణించిన విధానము సాధించిన విజయాలు తదితరాలను ముందు తరాల వారికి స్ఫూర్తిగా వివరించినట్లయితే వారు కూడా మహిళా రంగంలో పురోగతిని సాధిస్తారన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. మహిళా పురోగతి సమాజాన్ని మెరుగుపరచడానికి దోహదపడుతుందని అన్నారు.

ఒకరు సాధించిన పురోగతి మరొకరికి ఆదర్శంగా ఉంటే వారు కూడా రాణిస్తారని ఇది తోటి మహిళగా మరో మహిళకు అందిస్తున్న సహకారంగా పేర్కొనవచ్చునారు. మహిళా పురోగతికి మహిళలంతా సంఘటితంగా ముందుకు సాగితే సాధ్యమేనని తెలిపారు. దీనివల్ల సగటు కుటుంబం కూడా అన్ని విధాల బలపడుతుందని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -