Saturday, March 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నాణ్యమైన విద్యను నేర్పుదాం 

నాణ్యమైన విద్యను నేర్పుదాం 

- Advertisement -

హెచ్ఎం డానింగ్ టన్
బైరంపల్లి పాఠశాలలో  స్వయం పరిపాలన దినోత్సవం 
నవతెలంగాణ – మిడ్జిల్ 

ప్రభుత్వ పాఠశాలకు వస్తున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను బాధ్యతగా విద్యార్థులకు అందిస్తున్నామని ప్రధానోపాధ్యాయులు డానింగ్ టన్ చెప్పారు. శనివారం మండలంలోని బైరంపల్లి గ్రామంలో యుపిఎస్ పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులు ఒక్కరోజు ఉపాధ్యాయులుగా విధులు నిర్వహించి తోటి ఉపాధ్యాయులకు విద్యను బోధించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడాతు ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని ఎంతోమంది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చినది ఉపాధ్యాయులేనని తెలిపారు. కలెక్టర్గా పుష్ప జిల్లా విద్యాధికారిగా హాని మండల విద్యాధికారిగా జయవర్ధన్ ప్రధానోపాధ్యాయులుగా థామేశ్వర్   16 మంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా విధులు నిర్వహించారు. ఉత్తమ బోధ అందించిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పూర్వ, మంజుల, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -