నవతెలంగాణ – మిడ్జిల్
మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎంతో ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది అని పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని సర్పంచ్ బొల్గమ్ నాగరాజు గౌడు అన్నారు. శనివారం మండలంలోని చిల్వేర్ ప్రభుత్వ పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో భాగంగా మహిళా ఉపాధ్యాయులను ఘనంగా శాలు పూలమాలతో సన్మానించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సర్పంచ్ నాగరాజు గౌడ్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చారని తెలిపారు. ప్రభుత్వ తీసుకొస్తున్న ప్రతి సంక్షేమం అర్హులైన మహిళలందరికీ అందే విధంగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్యామలాకుమారి మధ్యాహ్నం భోజనం వర్కర్ బంగారమ్మ, అంగన్వాడి ఆయా అనితను శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు C. వెంకటయ్య, గురుప్రసాద్ గౌడ్, హర్యా, రమేష్ గౌడ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



