Saturday, March 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పరీక్షలను ప్రశాంత వాతావరణంలో రాయండి

పరీక్షలను ప్రశాంత వాతావరణంలో రాయండి

- Advertisement -

– రాష్ట్ర ఉత్తమ ప్రధానోపాధ్యాయ అవార్డు గ్రహీత మార్గం రాజేంద్రప్రసాద్ 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
ఈనెల  14 నుండి జరగబోయే పదవ తరగతి పరీక్షలను ప్రశాంత వాతావరణంలో రాయాలని రాష్ట్ర ఉత్తమ ప్రధానోపాధ్యాయ అవార్డు గ్రహీత, కోరుట్ల మండలం ఎకిన్ పూర్ పాఠశాల గెజిటెడ్ హెడ్ మాస్టర్ మార్గం రాజేంద్రప్రసాద్ అన్నారు. శనివారం మండలంలోని కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలపై అవగాహన కల్పించారు. ఎక్కువ శాతం విద్యార్థులు ప్రశ్న పత్రం ఇచ్చిన ఐదు నిమిషాలలో జవాబులు రాయడం మొదలు పెడతారని, అలా కాకుండా ప్రశ్నల్ని పూర్తిగా చదివి అడిగిన ప్రశ్నకు ఎన్ని మార్కులు జవాబు? ఎలా రాయాలి? ఎంత మేర రాయాలి? అని ఆలోచించి రాయాలన్నారు. ప్రశ్నపత్రంలో సరైన సమాధానం రాయగలమన్న నమ్మకం ఉన్న ఏ ప్రశ్నకైనా ముందు సమాధానం రాయాలని సూచించారు.

ప్రశ్న పత్రంలో ఛాయిస్ ఉన్నప్పుడు ప్రశ్నలు ఎంపిక సరిగా ఉండేలా చూసుకోవాలన్నారు. కఠినంగా ఉన్న ప్రశ్నలపై ఆందోళన చెందవద్దని, ముందుగా సులభంగా ఉన్న ప్రశ్నలకు జవాబు రాసిన తర్వాత కఠిన ప్రశ్నలకు జవాబులు రాయాలన్నారు. విద్యార్థులు ఎరుపు సిరా పెన్ను వాడకూడదన్నారు. విద్యార్థులు జవాబులు వ్యాసంలో రాయకుండా పాయింట్స్ రూపంలో రాస్తే అధిక మార్కులు వచ్చేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. సైడ్ హెడ్డింగులను టెన్త్ అండర్లైన్ చేయాలన్నారు. చేతిరాత బాగుంటేనే, ప్రశ్న పత్రాన్ని దిద్దే ఉపాధ్యాయునికి మీ పట్ల మంచి అభిప్రాయం కలుగుతుందని తెలిపారు. బిట్ పేపర్లో కొట్టివేతలు, దిద్దివేతలు లేకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు.

అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న దక్షిణ కొరియాలో ఫిజిక్స్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న కోనాపూర్ నివాసి డాక్టర్ శనిగరపు మల్లేశ్ మాట్లాడారు. విద్యార్థులు పాఠశాల దశలోనే ఉన్నత స్థాయి లక్ష్యాలు కలిగి ఉండాలని, లక్ష్యసాధనకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా భయపడకూడదన్నారు. తాము కూడా ఉన్నత పాఠశాల దశలో ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకుంటూ చదువుకున్నామని, కానీ ఇప్పుడు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టడం లేదని తెలిపారు. అప్పట్లో ఉన్నత పాఠశాల వెళ్లడానికి కనీసం రవాణా సౌకర్యం కూడా లేదని, అయినప్పటికీ కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్లడం జరిగిందని గుర్తు చేసుకున్నారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాంప్రసాద్, ఉపాధ్యాయులు మార్గం రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ శనగరపు మల్లేష్ లను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -