Saturday, March 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కార్యదర్శి అనురాధకు ఘన సన్మానం

కార్యదర్శి అనురాధకు ఘన సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని లొంగన్ గ్రామపంచాయతీ కార్యదర్శిగా 2019 నుండి అనురాధ విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సర్పంచి ఉషారాణి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అనురాధను సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామానికి చెందిన పెద్దలు పాల్గొన్నారు. 2019లో మొదట విధులు నిర్వహించెందుకు చార్జ్ తీసుకున్న నాడు గ్రామానికి మట్టి రోడ్డు తప్ప ఇతర వాహన సౌకర్యాలు ఎటువంటివి లేకపోయేది.

కాలినడకన నిత్యం విధులు నిర్వహిస్తూ ఎన్నో ఆటుపోట్లకు ఎదుర్కొని ధైర్యంతో ఆర్మూల గ్రామం నుండి గ్రామస్తులకు సేవలు అందించారు. అందులో భాగంగానే అంతర్జాతీయ మహిళా దినోత్సవ పురస్కరించుకొని గ్రామస్తులు సర్పంచ్తో సహా అందరి సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తో పాటు ఉపసర్పంచి గ్రామ పెద్దలు దీప్తి కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -