నవతెలంగాణ – జుక్కల్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జుక్కల్ మండలంలోని 30 గ్రామపచాయతీ లకు గాను 16 జిపి లకు మహిళా సర్పంచులే కావడం విశేషం. ఇటు వేల 2025లో జరిగిన స్థానిక సంస్థల జిపి ఎన్నికలో మహిళా సర్పంచులు అత్యధికంగా 60 శాతం కోటా సాధించి గెలుపొందారు. మహిళల సాధికారిక పొంది నందుకు మండలంలోని మహిళా సంఘాలు మరియు మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాదాపూర్ గ్రామానికి చెందిన ఆశా రామ్ చందర్ పటేల్ గ్రాడ్యుయేషన్ చదువుకుని మండలంలో మొదటి స్థానంలో విద్యావంతురాలు గుర్తింపు ఉంది. అనంతరం మాహమ్మదాబాద్ సర్పంచ్ సూర్నార్ శకుంతల బాలు వెల్ ఎడ్యుకేటెడ్ గా ఉంది.
వీరితో పాటు పడంపల్లి గ్రామానికి సర్పంచ్ విజయ కుమారి డిగ్రీ పూర్తి చేసుకున్నది. ఇదేవిధంగా కత్తల్ వాడి సర్పంచ్ గంగాబాయి, వజ్రకండి సర్పంచ్ సావిత్ర , నాగల్ గావ్ సర్పంచ్ జాదవ్ సునంద , చిన్న ఏడ్గి సర్పంచ్ జాదవ్ సుమిత్ర భాయి, గుల్లాతాండా సర్పంచ్ రాథోడ్ సుమతి , మధుర తాండ సర్పంచ్ చవాన్ అజిత్, జుక్కల్ సర్పంచ్ కర్రి వారి సావిత్ర సాయి గౌడ్, కేమ్ రాజ్ కల్లాలి సర్పంచ్ చంద్రకళ, కౌలాస్ సర్పంచ్ విద్య, లొంగన్ సర్పంచ్ ఉషారాణి, వీరిద్దరూ తప్ప మిగతావారు అంతంత మాత్రమే చదివిన వారు కావడం, అందులో కొంతమంది మొత్తానికి చదువు రానివారు అధికంగానే ఉన్నారు.
అత్యధికంగా మహిళా సర్పంచ్ లు నిరుపేద కుటుంబాల నుండి వచ్చిన వారు కావడం చెప్పుకోదగిన విశేషంగా చెప్పొచ్చు. మండలంలో మహిళలకు తగిన గౌరవం లభిస్తుందని ఆయా గ్రామాల మహిళా సర్పంచులు అన్నారు. తామంతగా కొత్తగా ఎన్నికైనామిని ఇటీవలే కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన శిక్షణ తరగతులు పాల్గొన్నందుకు తమకు అవగాహన కలిగిందని, పంచాయతీరాజ్ చట్టాలను తెలుసుకోవడం జరిగిందని, చేసి తెలియని విషయాలు తెలుసుకోవడం జరిగింది అభిప్రాయం వ్యక్తం చేశారు. రాబోయే రోజులలో గ్రామాల అభివృద్ధికి తామంతా కృషి చేస్తు, మహిళా శక్తి అంటే ఏంటో తమ పరిధిలోని గ్రామాలను అభివృద్ధి బాటలో పైనుంచి విధంగా కృషి చేసి చూపిస్తామని వివిధ గ్రామాల మహిళా సర్పంచులు అన్నారు.



