Saturday, March 7, 2026
E-PAPER
Homeఖమ్మంమల్లాయిగూడెంలో ప్రజాపాలన కార్యక్రమాలకు శ్రీకారం

మల్లాయిగూడెంలో ప్రజాపాలన కార్యక్రమాలకు శ్రీకారం

- Advertisement -

– ఆచరణలో పెడుతున్న సర్పంచ్ వెంకటమ్మ దంపతులు 
– సత్ఫలితాలు ఇస్తున్న సర్పంచ్ ల కు ఇచ్చిన శక్షణ
నవతెలంగాణ – అశ్వారావుపేట 

99 రోజుల ప్రజాపాలన – ప్రణాళిక ప్రతీ పంచాయితీ లో ప్రారంభం అయ్యాయి. దీనికి తోడు ఇటీవల పంచాయతీ సర్పంచ్ ల కు, వార్డు సభ్యులకు ఇచ్చిన పంచాయితీ పాలన పై వచ్చిన శిక్షణ సత్ఫలితాలు ఇస్తున్నాయి.అ శిక్షణ లో పాల్గొన్న సర్పంచ్, వార్డు సభ్యుల లో పాలనపై పట్టు చిక్కినట్లు అనిపిస్తుంది.

ఈ క్రమంలో 99 రోజుల పాటు నిర్వహించనున్న ప్రజాపాలన కార్యక్రమానికి మండలంలోని మల్లయిగూడెం గ్రామ పంచాయతీ శ్రీకారం చుట్టింది. కార్యక్రమంలో భాగంగా శనివారం సర్పంచ్ సంగం వెంకటమ్మ – దుర్గారావు దంపతులు ఆధ్వర్యంలో, కార్యదర్శి, పంచాయతీ సిబ్బంది కలిసి పంచాయతీ కార్యాలయాన్ని శుభ్రపరిచారు.

అనంతరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల ప్రాంగణాన్ని పంచాయతీ సిబ్బందితో కలిసి శుభ్రం చేయించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ సంగం వెంకటమ్మ – దుర్గారావు దంపతులు పాఠశాలను సందర్శించి విద్యార్థులు,ఉపాధ్యాయులతో మాట్లాడారు. పాఠశాలలో విద్యాబోధన సక్రమంగా జరుగుతుందా అని అడిగి తెలుసుకున్నారు.

వేసవి కాలం సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం, తాగునీటి సదుపాయం, శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. గ్రామాభివృద్ధి లక్ష్యంగా 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమాన్ని గ్రామంలో సమర్థవంతంగా అమలు చేస్తామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -