నవతెలంగాణ – నసురుల్లాబాద్
నసురుల్లాబాద్ మండలం అంకోల్ తండాలో పదో తరగతి విద్యార్థులకు కోనేరు ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం పరీక్ష సామగ్రిని పంపిణీ చేశారు. వార్షిక పరీక్షలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు చేదోడువాదోడుగా నిలవాలనే ఉద్దేశంతో విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులను అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాలరాజ్ మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు తమ లక్ష్యాన్ని ఎంచుకొని కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సమితి సభ్యులు ఆకాంక్షించారు. విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకొని కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సమితి సభ్యులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



