Saturday, March 7, 2026
E-PAPER
Homeఖమ్మంఉపాధి హామీ పథకంపై సర్వే చేసిన ప్రసాద్ రావు

ఉపాధి హామీ పథకంపై సర్వే చేసిన ప్రసాద్ రావు

- Advertisement -

– ఎన్ఎంఎంఎస్ యాప్‌తో ఉపాధిపై ప్రభావం
– కూలీలకు వేతనాలు ఆలస్యం
– ఉపాధి హామీ పనులపై సర్వే
– గిరిజన సంఘం నాయకులు సోడెం ప్రసాద్ 
నవతెలంగాణ – అశ్వారావుపేట 

మండలంలోని నందిపాడు, కుడుములపాడు ల్లో వీబీ జీ రాం జీ (జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం) పనుల అమలుపై వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం,గిరిజన సంఘాల ఆధ్వర్యంలో శనివారం క్షేత్ర స్థాయి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీల హాజరు నమోదు విధానం,వేతనాల చెల్లింపుల పరిస్థితిని పరిశీలించారు.

కుడుములపాడు లో మొత్తం 103 మంది కూలీలు ఉపాధి పనులకు హాజరుకాగా, ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా కేవలం 69 మందికే హాజరు నమోదైనట్లు వెల్లడైంది. దీంతో 34 మంది కూలీలకు పని చేసినప్పటికీ నమోదు కాకపోవడం వల్ల ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.అంతేకాకుండా ఐదు వారాలుగా పనులు చేస్తున్నప్పటికీ ఇప్పటివరకు వేతన స్లిప్పులు గానీ, కూలీ ల వేతనం గానీ అందలేదని తెలిపారు.

నందిపాడు లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది.  ఆరు వారాలుగా పనిచేస్తున్న 54 మంది కూలీలకు ఇప్పటివరకు వేతనాలు లేదా స్లిప్పులు అందకపోవడం కార్మికుల్లో అసంతృప్తిని రేకెత్తిస్తోంది. ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల వల్ల గ్రామీణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సంఘాల నాయకులు విమర్శించారు. ఈ విధానాలను ప్రజలు కలసి తిప్పికొట్టాలని వారు పిలుపునిచ్చారు.

ఈ సర్వే కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యులు సోడెం ప్రసాద్,నందిపాడు సర్పంచ్ కూరం దుర్గమ్మ,వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ సభ్యులు కారం సూరిబాబు, రైతు సంఘం మండల కమిటీ సభ్యులు మడకం నాగేశ్వరరావు, శాఖ కార్యదర్శి మడకం రాజబాబు,ఉప సర్పంచ్ తుట్టి వీరభద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -