Saturday, March 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతులకు ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన  

రైతులకు ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన  

- Advertisement -

ఆయిల్ ఫామ్ & ఉద్యాన పంటల సాగు లాభదాయకం
పంట మార్పిడితో అధిక ఆదాయం
జిల్లా ఉద్వాన అధికారి జినుగు మరియాన్న
నవతెలంగాణ – నెల్లికుదురు 

మండలంలోని వివిధ గ్రామాలలో నూతన ఆయిల్ ఫామ్సు తీకోవాలని రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉధ్వానాధికారి మరియాన్న తెలిపారు. శనివారం డిమాండ్ ఉన్న పంటలపై అవగాహన కార్యక్రమాన్ని రైతులకు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయిల్ పామ్, ఉద్యాన, కూరగాయలు, పండ్లు, పూలు, మల్బరీ మొదలైన  మార్కెట్ డిమాండ్ ఉన్న పంటల సాగు, పుట్టగొడుగులు, తేనెటీగల పెంపకం, మామిడి కాయలకు ఫ్రూట్ బాగింగ్ మరియు రాయితీలు ప్రభుత్వం ద్వారా ఎలా వస్తాయని రైతులకు వివరించినట్లు చెప్పారు. రైతులు పంట మార్పిడి చేస్తే ఎంత లాభం ఉంటుందని అన్నారు.

పథకాలు మరియు రాయితీ వివరాలు
పథకం పేరు యూనిట్ రాయితీ రూ. 
ఆయిల్ పామ్ పథకం ఆయిల్ పామ్ విస్తరణ – మొక్కలకు ఎకరం 11,600/-
మొదటి సంవత్సరం ఆయిల్ పామ్ తోటల నిర్వహణ మరియు అంతర పంటల సాగు 4,200/-
రెండవ సంవత్సరం ఆయిల్ పామ్ తోటల నిర్వహణ మరియు అంతర పంటల సాగు 4,200/-
మూడవ సంవత్సరం ఆయిల్ పామ్ తోటల నిర్వహణ మరియు అంతర పంటల సాగు 4,200/-
నాలుగవ సంవత్సరం ఆయిల్ పామ్ తోటల నిర్వహణ మరియు అంతర పంటల సాగు 4,200/-

బిందు సేద్యం 22,518/- మొత్తం రాయితీ 50,918/-

సమీకృత ఉద్యాన అభివృద్ది మిషన్ – MIDH

పండ్ల తోటల విస్తరణ ఎకరం మామిడి 19,200/- బొప్పాయి 7,200/- నిమ్మ 19,200/- జామ 19,200/- డ్రాగన్ ఫ్రూట్ 64,800/- అవకాడో 12,000/- హైబ్రిడ్ కూరగాయలు 9,600/- పూలు ఎకరం 8,000/- కోకో 4,800/- మామిడి తోటల పునఃరుద్దరణ 9,600/- రాష్ట్రీయ కృషి వికాస యోజన – RKVY శాశ్వత పందిర్ల నిర్మాణం అర ఎకరం 50,000/-  పట్టు పరిశ్రమ మల్బరీ సాగు – షెడ్ నిర్మాణంతో కలిపి రెండు ఎకరాలు 5,00,000/- 

ఈ కార్యక్రమంలో  రాజుల కొత్తపల్లి సర్పంచ్ జనార్ధన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి యాకూబ్ రెడ్డి, ఆయిల్ ఫెడ్ ఫీల్డ్ అధికారులు రాజ్ కుమార్, నర్మద, రైతులు కుమార్, కృష్ణ, మహమూద్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -