Sunday, March 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యం..

గ్రామ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యం..

- Advertisement -

– సర్పంచ్ పులిమామిడి శైలజశ్రీశైలం..
నవతెలంగాణ – ఊరుకొండ 

గ్రామంలో ఏలాంటి సమస్యలు తలెత్తకుండా.. గ్రామ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యం అని సర్పంచ్ పులిమామిడి శైలజశ్రీశైలం అన్నారు. శనివారం ఊరుకొండ మండల పరిధిలోని నర్సంపల్లి గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లక్ష్యం 99రోజుల కార్యాచరణలో భాగంగా గ్రామంలో పారిశుధ్యం, త్రాగు నీటి సమస్యపై నర్సంపల్లి సర్పంచ్ పులిమామిడి శైలజశ్రీశైలం ఆధ్వర్యంలో పారిశుధ్య పనులను నాణ్యతగా చేపట్టాలని నిర్ణయించారు.

గ్రామపంచాయతి లోపల మరియు పరిసరాలు మరియు ప్రాథమిక పాఠశాల పరిసర ప్రాంతంలో పరిసరాలు శుభ్రం చేయించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, వార్డు మెంబర్స్ విజయ్ కుమార్, లక్ష్మి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విరెడ్డి వెంకటరెడ్డి, పంచాయతీ కార్యదర్శి మరియు పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడి కార్యకర్త, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు, గ్రామ మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -