Sunday, March 8, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల్లో సత్తా చాటిన చిన్న చిత్రాలు

గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల్లో సత్తా చాటిన చిన్న చిత్రాలు

- Advertisement -

తెలంగాణ జీవితాన్ని, సంస్కతుల్ని ఆవిష్కరించిన సినిమాలకు పెద్ద పీట
చిరంజీవికి ఎన్టీఆర్‌ నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్‌

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అంద జేస్తున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డులను ప్రకటించారు. శనివారం తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లుకు గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల జ్యూరీ కమిటీ విజేతల జాబితాను అందజేసింది. ఈ అవార్డులను ప్రారంభించి రెండో సంవ్సతరమిది. 2025 సంవత్సరానికిగానూ సినీ పరిశ్రమలో ఉత్తమ ప్రతిభను కనబరచిన నటీనటులు, సాంకేతిక నిపుణులతోపాటు పలు ప్రత్యేక అవార్డులను కూడా జ్యూరీ ప్రకటించింది.
ఈ ఏడాది అవార్డుల్లో చిన్న చిత్రాలు సత్తా చాటాయి. ‘రాజు వెడ్స్‌ రాంబాబు’, ‘దండోరా’, ‘ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో’, ‘యుఫోరియా’, ‘ఛాంపియన్‌’ వంటి తదితర చిత్రాలు ఎక్కువ విభాగాల్లో పురస్కారాలు దక్కించుకుని విజయకేే తనాన్ని ఎగురవేశాయి. ఈ పురస్కారాల్లో తెలంగాణ జీవితాన్ని, సంస్కతుల్ని ప్రతిబింబించే సినిమాలకు జ్యూరీ అగ్ర తాంబూలం ఇవ్వడం విశేషం.

అగ్రనటుడు చిరంజీవిని ఎన్టీఆర్‌ జాతీయ ఫిల్మ్‌ అవార్డు వరించగా, పైడి జయరాజ్‌ ఫిల్మ్‌ అవార్డుకు కమల్‌ హాసన్‌, బిఎన్‌ రెడ్డి ఫిల్మ్‌ అవార్డుకు సింగీతం శ్రీనివాసరావు, నాగిరెడ్డి అండ్‌ చక్రపాణి ఫిల్మ్‌ అవార్డుకు అశ్వినీదత్‌, టి.ఎల్‌ కాంతారావు ఫిల్మ్‌ అవార్డుకు ఆర్‌.నారాయణ మూర్తి, రఘుపతి వెంకయ్య ఫిల్మ్‌ అవార్డుకు రమేష్‌ ప్రసాద్‌, సి.నారాయణరెడ్డి ఫిల్మ్‌ అవార్డుకు సుద్దాల అశోక్‌ తేజ, అక్కినేని నాగేశ్వరరావు ఫిల్మ్‌ అవార్డుకు జయసుధ ఎంపికయ్యారు.
2025 జనవరి 1 నుంచి డిసెంబర్‌ 31 వరకు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ ద్వారా సర్టిఫికెట్‌ పొందిన చిత్రాలకు, షార్ట్‌ ఫిల్మ్‌లకు ఈ అవార్డులను ప్రకటించారు.

ఈ ఏడాది అవార్డుల్లో బెస్ట్‌ ఫిల్మ్‌ క్రిటిక్‌ అవార్డుకు ‘నవ తెలంగాణ’ కాలమిస్ట్‌ హెచ్‌.రమేష్‌బాబు ఎంపికయ్యారు. ఈనెల 19న ఉగాది పండగ నేపథ్యాన్ని పురస్కరించుకుని ఈ ప్రతిష్టాత్మక అవార్డులను హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో విజేతలకు అందజేయనున్నారు. గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డులకు మెయిన్‌ స్ట్రీమ్‌ అవార్డ్స్‌ అధ్యక్షునిగా సంగీత దర్శకుడు మణిశర్మ వ్యవహరించారు. షార్ట్‌ ఫిలిమ్స్‌, డాక్యుమెంటరీ విభాగానికి దర్శకుడు కనకమేడల విజయకష్ణ చైర్మన్‌ కాగా, పుస్తకాలు- సమీక్షల పరిశీలనకు తనికెళ్ళ భరణి చైర్మన్‌గా ఉన్నారు. ప్రత్యేక అవార్డుల కమిటీకి తమ్మారెడ్డి భరద్వాజ అధ్యక్షునిగా వ్యవహరించారు.
వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ ఉత్తమ చిత్రంగా ఎంపికవ్వడంతోపాటు ఉత్తమ దర్శకుడు, ఉత్తమ గాయకుడు, స్పెషల్‌ జ్యూరీ సహా నాలుగు అవార్డ్స్‌ దక్కించుకోవడం విశేషం.

అలాగే సెకండ్‌ బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌గా, శివాజీకి బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్టర్‌గా, మార్క్‌ కె రాబిన్‌కి బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా మూడు కేటగిరీల్లో ‘దండోరా’ అవార్డుల్ని పొం దింది. ఇక తేజా సజ్జా నటించిన ‘మిరారు’ చిత్రం కూడా ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌, ఉత్తమ ఎడిటర్‌, ఉత్తమ సినిమా టోగ్రాఫర్‌ వంటి విభాగాల్లో అవార్డుల్ని దక్కించుకుంది.
‘సంక్రాంతికి వస్తున్నాం’ ఉత్తమ వినోదాత్మక చిత్రం, ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డులకు అర్హత సాధించగా, ఉత్తమ జాతీయ సమగ్రత చిత్రంగా ‘తండేల్‌’, ఇదే చిత్రంలోని ఉత్తమ నటనకు మీరో నాగచైతన్య అవార్డును దక్కించు కున్నారు. అలాగే ‘గర్ల్‌ఫ్రెండ్‌’లోని ఉత్తమ నటనకు గానూ రష్మిక మందన్న ఉత్తమ నటిగా ఎంపికయ్యారు.

‘దిగ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో’ సినిమా ఉత్తమ తృతీయ చిత్రంగా, ఉత్తమ బాలనటుడు విభాగాల్లో గెలుపొందింది. ‘యుఫో రియా’ చిత్రానికి ఉత్తమ కథారచయితగా గుణశేఖర్‌, ఉత్తమ సహాయనటిగా భూమిక ఎంపికయ్యారు.
శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ నటించిన ‘ఛాంపియన్‌’ చిత్రం బెస్ట్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌, బెస్ట్‌ కొరియోగ్రాఫర్‌, బెస్ట్‌ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌, బెస్ట్‌ క్యాస్టూమ్‌ డిజైనర్‌, స్పెషల్‌ జ్యూరీ వంటి 5 అవార్డులతో సత్తా చాటింది.

‘నవ తెలంగాణ’ కాలమిస్ట్‌కు బెస్ట్‌ ఫిల్మ్‌ క్రిటిక్‌ అవార్డు
ఈ ఏడాది గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల్లో బెస్ట్‌ ఫిల్మ్‌ క్రిటిక్‌గా ‘నవ తెలంగాణ’ దిన పత్రిక కాలమిస్ట్‌ హెచ్‌.రమేష్‌బాబు ఎంపికవ్వడం విశేషం. భారతదేశంలో మూకీ సినిమాల కాలంలో హైదరాబాద్‌కి సంబంధించిన చాలా విషయాలపై రమేష్‌బాబు పరిశోధన చేశారు. 1896 నుండి 1932 వరకు అప్పటి ఉమ్మడి హైదరాబాద్‌ స్టేట్‌ పరిపాలన కాలంలో తెలంగాణ ప్రాంతంలో మూకీ సినిమాల నిర్మాణం జరిగింది. హైదరాబాద్‌ నగరంలో మూకీ సినిమాల ప్రదర్శన, చిత్రీకరణలకు సంబంధించిన పరిణామ, వికాసాలు దశాబ్దాల తరబడి చరిత్రకారుల దష్టిలోకి వెళ్లకుండానే నిర్లక్ష్యానికి గురయ్యాయి.
ఈ విషయాలన్నింటిని ఒకటిన్నర దశాబ్దానికి పైగా పరిశోధన చేసి 1896-97లో హైదరాబాద్‌లో బొంబాయి, మద్రాస్‌లతో సమాంతరంగా మూకీ చిత్రాల ప్రదర్శన జరిగినట్లుగా పూర్తి సాక్షాధారాలతో ఆయన నిరూపించారు. 1922లో ధీరేన్‌ గంగూలీ కలకత్తా నుండి వచ్చి 8 మూకీ సినిమాలు తీసిన విషయాన్ని ఆసక్తికరమైన అంశాలను సమగ్రంగా విశ్లేషించారు.
అలాగే ఈ మూకీ సినిమాల కాలంలో బొంబాయి వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన నటీనటుల గురించి, టెక్నీషియన్ల గురించి ఈ తరానికే కాదు, చెప్పాలంటే తెలంగాణలో ఎవరికీ తెలియని సినిమా విషయాలను తెలియజేశారు. తెలంగాణలో సినిమా రంగం, సినిమాల నిర్మాణం ఏమీ లేవు అనే వారికి 130 సంవత్సరాల క్రితం హైదరాబాద్‌ స్టేట్లో సినిమాల పరిణామ వికాసాల్ని 28.09.2025 నుండి 28.12.2025 వరకు నవ తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం ‘సోపతి’లో హెచ్‌ రమేష్‌ బాబు గుదిగుచ్చి రాసిన వ్యాసాలకు గద్దర్‌ ఫిలిం అవార్డులలో క్రిటిక్స్‌ విభాగంలో పురస్కారం లభించింది.

గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డులు -2025 విజేతల వివరాలు
ప్రత్యేక అవార్డులు

ఎన్టీఆర్‌ నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డు – చిరంజీవి
పైడి జయరాజ్‌ ఫిల్మ్‌ అవార్డు – కమల్‌ హాసన్‌
బిఎన్‌ రెడ్డి ఫిల్మ్‌ అవార్డు – సింగీతం శ్రీనివాసరావు
నాగిరెడ్డి అండ్‌ చక్రపాణి ఫిల్మ్‌ అవార్డు – అశ్వినీదత్‌
టి.ఎల్‌ కాంతారావు ఫిల్మ్‌ అవార్డు – ఆర్‌.నారాయణమూర్తి
రఘుపతి వెంకయ్య ఫిల్మ్‌ అవార్డు – రమేష్‌ ప్రసాద్‌
సి.నారాయణరెడ్డి ఫిల్మ్‌ అవార్డు – సుద్దాల అశోక్‌ తేజ
అక్కినేని నాగేశ్వరరావు ఫిల్మ్‌ అవార్డు – జయసుధ

ఫీచర్‌ ఫిల్మ్స్‌
ఉత్తమ నటుడు – నాగ చైతన్య (తండేల్‌)
ఉత్తమ నటి – రష్మిక మందన్న (ది గర్ల్‌ ఫ్రెండ్‌)
ఉత్తమ చిత్రం – రాజు వెడ్స్‌ రాంబాయి
ఉత్తమ ద్వితీయ చిత్రం- దండోరా
ఉత్తమ తతీయ చిత్రం – ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో
ఉత్తమ జాతీయ సమగ్రత చిత్రం – తండేల్‌
ఉత్తమ పర్యావరణ చిత్రం – ఇగ్వా
ఉత్తమ ఫీచర్‌ ఫిల్మ్‌ (డెబ్యూ) – లిటిల్‌ హార్డ్స్‌
ఉత్తమ వినోదాత్మక చిత్రం -సంక్రాంతికి వస్తున్నాం
ఉత్తమ సామాజిక సందదేశాత్మక చిత్రం- కోర్టు
ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ చిత్రం -మిరారు
ఉత్తమ బాలల చిత్రం- అనగనగా
ఉత్తమ దర్శకుడు – సాయిలు కాంపాటి (రాజు వెడ్స్‌ రాంబాయి)
ఉత్తమ సహాయ నటుడు – శివాజీ (దండోరా)
ఉత్తమ సహాయ నటి – భూమిక (యుఫోరియా)
ఉత్తమ సంగీత దర్శకుడు – మార్క్‌ కె రాబిన్‌ (దండోరా)
ఉత్తమ నేపథ్య గాయకుడు – అనురాగ్‌ కులకర్ణి (రాజు వెడ్స్‌ రాంబాయి)
ఉత్తమ నేపథ్య గాయని – సాహితి చాగంటి (కన్నప్ప)
ఉత్తమ హాస్యనటుడు – కష్ణ తేజ రెడ్డి (జిగ్రీస్‌)
ఉత్తమ బాలనటుడు – రోహన్‌ రారు (ప్రీ వెడ్డింగ్‌ షో)
ఉత్తమ కథా రచయిత – గుణశేఖర్‌ (యుఫోరియా)
ఉత్తమ స్క్రీన్‌ ప్లే రైటర్‌ – అనిల్‌ రావిపూడి
ఉత్తమ గేయ రచయిత – నందకిశోర్‌ (కుబేర)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌ – కార్తీక్‌ ఘట్టమనేని (మిరారు)
ఉత్తమ ఎడిటర్‌ – శ్రీకర్‌ ప్రసాద్‌ (మిరారు)
ఉత్తమ ఆడియోగ్రాఫర్‌- ఎం.ఆర్‌. రాధాకష్ణన్‌ (కిష్కింధపురి)
ఉత్తమ కొరియోగ్రాఫర్‌- ఆట సందీప్‌ (ఛాంపియన్‌)
ఉత్తమ ఆర్ట్‌ డైరెక్టర్‌- తోట తరణి (ఛాంపియన్‌)
ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్‌- గోవిందరాజు (అఖండ-2)
ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌- చంద్రకాంత్‌, సోనావల్‌, అజరు కుమార్‌ (ఛాంపియన్‌)

స్పెషల్‌ జ్యూరీ అవార్డులు
స్పెషల్‌ జ్యూరీ ఉత్తమ చిత్రం-23
జ్యూరీ ఉత్తమ నటుడు-చైతూ జొన్నలగడ్డ (రాజు వెడ్స్‌ రాంబాయి)
స్పెషల్‌ జ్యూరీ ఉత్తమ నటి-అనంతిక (8 వసంతాలు)
స్పెషల్‌ జ్యూరీ హీరో- రోషన్‌ (ఛాంపియన్‌)

ఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్‌ అవార్డులు
ఫస్ట్‌ బెస్ట్‌ డాక్యుమెంటరీ ఫిల్మ్‌ : యూనిటీ (మ్యాన్‌ ఆఫ్‌ సోషల్‌ జస్టీస్‌) – చిరందాస్‌ శ్రీకాంత్‌
సెకండ్‌ బెస్ట్‌ డాక్యుమెంటరీ ఫిల్మ్‌ : ది ఫస్ట్‌ యాక్షన్‌ హీరో పైడి జయరాజ్‌ ప్రస్థానం – డా||పొన్నం రవిచంద్ర
థర్డ్‌ బెస్ట్‌ డాక్యుమెంటరీ ఫిల్మ్‌ : మహామనిషి డాక్టర్‌ ఏఎస్‌రావు – బాలబ్రహ్మచారి పూసపాటి

ఉత్తమ షార్ట్‌ ఫిల్మ్‌ అవార్డులు
ఫస్ట్‌ బెస్ట్‌ షార్ట్‌ ఫిల్మ్‌ : వనజీవి రామయ్య (భూసం రవీంద్రనాథ్‌)
సెకండ్‌ బెస్ట్‌ షార్ట్‌ ఫిల్మ్‌ : మౌనమే నీ భాష
(రవీంద్రవర్మ ఇందుకూరి, విశ్వాస్‌ హనుకర్‌)
థర్డ్‌ బెస్ట్‌ షార్ట్‌ ఫిల్మ్‌ : సైబర్‌ స్లేవరీ (కె.నీలిమ)
డిప్లొమా ఆఫ్‌ మెరిట్‌ – తల్లిదండ్రుల ఆత్మగౌరవం (కనపర్తి హనుమండ్లు)
ఉత్తమ పుస్తకం – శూన్యం నుంచి శిఖరాగ్రాలకు.. (ప్రభు)
ఉత్తమ సినీ విమర్మకుడు – హెచ్‌.రమేష్‌బాబు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -