Sunday, March 8, 2026
E-PAPER
Homeసోపతిశ్రమయేవ జయతే ...!

శ్రమయేవ జయతే …!

- Advertisement -

మనందరికి సినిమాల ద్వారా పరిచయమైన వ్యక్తి బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌. బాలీవుడ్‌తో ఎలాంటి వారసత్వం లేకుండానే స్వయం కషితో నేడు వేల కోట్లకు అధిపతిగా ఎలా మారాడు. రాత్రికి రాత్రే అతడికి సౌది దేశపు లాటరీ వరించలేదు. లేదా అతని ఇంటి పరిసరాలలో లంకెబిందెలు దొరకలేదు. సినిమాలలో నటించాలనే కోరికే నేడు ఈ స్థాయికి తీసుకొని వచ్చింది.

మొదట్లో తన అదష్టాన్ని పరీక్షించుకోవడానికి ఎన్నో రోజులు నిరీక్షించాల్సి వచ్చింది. మొదటగా సీరియల్స్‌లో నటించి అనంతరం 1992 లో ‘దివానా’ అనే సినిమా ద్వారా బాలీవుడ్‌ లోకి అడుగుపెట్టాడు. ఆ సినిమా విజయం సాధించటంతో క్రమంగా నిలదొక్కుకునే ప్రయత్నం చేసి, ఈ స్థాయికి ఎదిగాడు. అంతకు ముందు హాలీవుడ్‌లో ప్రసిద్ధి పొందిన టామ్‌ క్రూజ్‌, జాకీచాన్‌ లాంటి వారిని పక్కకు నెట్టి ఓ భారతీయ నటుడు ప్రపంచస్థాయి ధనికుడిగా మారటం వెనుక గల అతడి బిజినెస్‌ మెలకువలు ఎలా పని చేస్తాయో తెల్సుకునే ప్రయత్నం చేద్దాం. 13 ఫిలంఫేర్‌ అవార్డులు, 4 డాక్టరేట్లు, పద్మశ్రీ (2005), ఫ్రాన్స్‌ ప్రభుత్వం 2007 లో order of art and letters పురస్కారం, 2014 లోLegion of Honour పురస్కారం కూడా ప్రకటించింది. కొరియా లాంటి దేశాలు కూడా అవార్డులతో సంత్కరించాయి. ఇలాంటి వ్యక్తి సుమారు నాలుగు వందల (400) యాసిడ్‌ బాదితులకు సహాయం చేస్తున్నాడన్న విషయం చాలామందికి తెలిసి వుండకపోవచ్చు.
ఏ పిల్లవాడు ఐతే నివసించడానికి సరిగ్గా ఇల్లు కూడా లేదో నేడు అతడు నివసిస్తున్న ముంబాయిలోని ‘మన్నత్‌’ ఇంటి విలువ సుమారు రెండు వందల కోట్లు ఉంటుందనేది ఓ అంచనా. అరబ్‌ దేశంలోని భూర్జ్‌ ఖలీఫా వద్ద నిలబడి ఫోటో దిగడానికి అలాగే ఐఫిల్‌ టవర్‌ వద్ద నిలబడి, తాజ్‌ మహాల్‌ వద్ద ఫొటో దిగడానికి పర్యాటకులు ఎంతగా తాపత్రయపడుతారో షారుఖ్‌ఖాన్‌ ఇంటి ముందు (మన్నత్‌) ఫొటో దిగడానికి అంతే ఉబలాటపడతారు. అంతెందుకు అదే బూర్జ్‌ ఖలీఫా షారుఖ్‌ జన్మ దినమైన నవంబర్‌ 02న లేజర్‌ కాంతిలో జన్మదిన శుభాకాంక్షలు చెప్పటం విశేషం. ఢిల్లీ రోడ్ల మీద తిరిగిన గ్రాడ్యుయేట్‌ విద్యార్ధి ఈరోజు ప్రపంచం గర్వించే స్థాయికి ఎదగటం రాత్రికి రాత్రి జరిగిన కల్పిత సినిమా కథ కాదు. ఇదంత అతడి కషి, పట్టుదల వల్ల నేడు విశాలమైన సామ్రాజ్యాన్ని నిర్మించుకోగాలిగాడు. ప్రపంచంలో ఏ మూలన జల్లెడ పట్టిన షారుఖ్‌ ఖాన్‌ అభిమానులు దొరుకుతారు. వారిలో అగ్రదేశపు అధ్యక్షులు, ఇతర సెలబ్రిటీలు వుండటం మామూలు విషయం కాదు
.
అనురాగ్‌ కశ్యప్‌ ఖాన్‌ గురించి ఓ ఇంటర్వూలో షారుఖ్‌, లియోనార్డో డికాఫ్రియో, బెర్లిన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు ఒకే రోజు చేరుకున్నారు. అక్కడి అభిమానులు ఖాన్‌ కోసం గుమి గూడారు తప్ప లియోనార్డో డికాఫ్రియో కోసం కాదు అంటాడు. అలాగే ఈ సంఘటన స్వయంగా తను అక్కడ వుండి చూశానని చెప్తాడు.
అవతార్‌, టైటానిక్‌ లాంటి హాలివుడ్‌ చిత్రాలను నిర్మించిన జేమ్స్‌ కేమోరూన్‌ ఓసారి ఇంటర్వ్యూలో ఇలా అన్నాడు. షారుఖ్‌ ఖాన్‌కు ఆటోగ్రఫి ఇవ్వడానికి ముందు నేనే అతడి ఆటోగ్రాఫ్‌ తీసుకుంటాను అని. ఒబామా, ట్రంప్‌ మనదేశానికి వచ్చినప్పుడల్లా షారుఖ్‌ ఖాన్‌ పేరు, సినిమాల పేర్లు ప్రస్తావించకుండా వారి పర్యటన పూర్తి కాదు. అంతెందుకు 2007 వ సంవత్సరంలో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ప్రారంభించాలనుకున్నప్పుడు లలిత్‌ మోడీకి వచ్చిన ఓ గొప్ప ఆలోచన ఈ క్రీడల్లో షారుఖ్‌ ఖాన్‌కు కూడా భాగస్వామ్యం కల్పిస్తే మరింత వాణిజ్యపరమైన మార్కెట్‌, ఆదరణ లభిస్తాయని భావించి ఇందులో అతడిని కూడా భాగస్వామిని చేశాడు. ఒకవేళ కింగ్‌ ఖాన్‌IPL తో జట్టుకట్టక పోతే అంతగా క్రేజీ ఉండేదా? అనేది ఆలోచించాల్సిన విషయం. మిత్రులారా షారుఖ్‌ ఖాన్‌ జీవితం ఓ కల్పిత కథలాగా లేదా సినిమా కథలాగా మనకు అనిపించినా యదార్ధమైనదిగా చూడాలి. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నేడు సినిమా ఇండిస్టీలో ఇంతింతైవటుడింతై అన్నట్లు ఎదగటం మామూలు విషయం కాదు.

1990 లలో ముంబాయిలోని CST స్టేషన్‌ లో దిగిన ఓ పాతిక సంవత్సరాల కుర్రాడు అక్కడి వాతావరణంతో ప్రభావితుడై తన మనస్సులో పెట్టుకున్న ‘లక్ష్యం’ మరిచి పక్కదారి పడతాడు. కానీ షారుఖ్‌ ఖాన్‌ అలా దారి తప్పలేదు. అతడి దష్టి మొత్తం సినిమాలో నటించాలని ఉంది. ఎదో ఒకరోజు ముంబాయిని, అలాగే ప్రపంచానికి ఏదో చేసి చూపిస్తానని కలలు కన్నాడు అదే చేశాడు.
సినిమాల ద్వారా తనకు వస్తున్న పాపులారిటి, ఆదరణ వాటివల్ల వచ్చే ఆదాయాన్ని దుర్వినియోగం చేయకుండా అంచెలంచెలుగా ఎలా ఎదిగాడో వివరించే ప్రయత్నం చేస్తాను మీరూ చదవండి. అతడిలో ఉన్న వ్యాపారాత్మక ఆలోచన కూడా సినిమా విభాగాలలో వున్న లోటును గుర్తించి అందులో పెట్టుబడులు పెట్టి లాభాలు అర్జించటం వల్ల తన సంపాదనను ఇంకాస్తా పెంచుకుంటాడు. షారుఖ్‌ ఖాన్‌ తన సినిమాల నిర్మాణంలో అయ్యే ఖర్చును ఎవరి వద్దా అప్పుగా తీసుకోడు. డబ్బులు వడ్డీలకు తీసుకోవడం తనకు ఇష్టం లేదు అంటాడు. అందుకే తను నిర్మించబోయే సినిమాలకు కావలసిన ‘ఫండింగ్‌’ మొత్తం తాను నటించే యాడ్‌ ఏజెన్సీల ద్వారా అడ్వాన్స్‌ రూపంలో తీసుకుంటాడు. అలా వచ్చిన డబ్బులను తన సినిమాలో పెట్టుబడులు పెట్టి ఆ సినిమాను పూర్తి చేస్తాడు.
ఒకవేళ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తే కోట్లలో ఆదాయం గడిస్తాడు. దురదష్టవశాత్తు సినిమా బాగా ఆడకపోతే తనకు నష్టం రాలేదంటాడు. ఎందుకంటే తను ఎవరికి బాకీలు చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే సంపన్నుల ఇళ్ళలో జరిగే బర్త్‌డే పార్టీలు వివాహ కార్యక్రమాలకు డాన్స్‌ చేయడం ద్వారా విదేశాలలో జరిగే షోల ద్వారా కోట్లలో అర్జిస్తాడు. ఫలితంగా వచ్చిన డబ్బును సినిమాలపై పెట్టుబడిగా పెట్టి నిర్మిస్తాడు తప్ప ఎవరి వద్ద వడ్డీలు చేసి సినిమాలు నిర్మించడు. అందుకే నేను సురక్షితంగా వుంటాను అంటాడు.

2014 లో అక్షరు కుమార్‌, టైగర్‌ (షాఫ్‌ సినిమా రిలీజు ఐనది. అది ‘బడేమియా ఛోటేమియా’ ఆ సినిమా పూర్తిగా నిరాశ పర్చింది. నిర్మాత బగ్నానికి ముంబాయిలోని ఏడంతస్తుల భవనం అమ్మి వాటి అప్పులు తీర్చాల్సి వచ్చింది. బాలీవుడ్‌ షాహెన్‌ షా అమితాబచ్చన్‌ తన కంపెనీ ABCL నిర్వహణలో 250 కోట్ల అప్పుల్లో కూరుకొని పోయారు అందులో పనిచేసే కార్మికులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితి. తన సినిమాలు కూడా ఆడకపోవడం, తగ్గిన సినిమా అవకాశాల వల్ల తీవ్రమైన సంక్షోభంలో కూరుకొనిపోయారు. ధీరుబాయి అంబాని గారు చేసిన సహాయం వల్ల ఐతేనేమి తర్వాత వచ్చిన సినిమా అవకాశాలు, యాడ్స్‌ వల్ల వచ్చిన డబ్బులతో నిలదొక్కుకున్నట్లు స్వయంగా ఓ ఇంటర్వ్యూ లో చెప్పాడు. ”రూప్‌ కిరాణి చోరోంక రాజా” సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడంతో 12 కోట్ల అప్పు తీసుకున్న బోణీ కపూర్‌ తీవ్రమైన మానసిక కుంగుబాటుకు గురైనాడు. ఆ సమయంలో ఇవన్నీ ప్రత్యక్షంగా చూసిన షారుఖ్‌ ఖాన్‌ తన సినిమాల నిర్మాణ సమయంలో అందుకే అప్పు తీసుకోనని స్వయంగా ప్రకటిస్తాడు. అప్పు తీసుకోవడం తేలిక కాని పరిస్థితులు రాత్రికి రాత్రే సినీ పరిశ్రమలో మారిపోతూ ఉంటారు. కాబట్టి వాటిని తీర్చడానికి జీవితాలే తారుమారు అవుతాయి అంటాడు. అందుకే ఖారుఖ్‌ ఖాన్‌ నటించిన హ్యాపీ న్యూ ఇయర్‌, జవాన్‌, చెన్నై ఎక్స్‌ ప్రెస్‌, లేదా రావణ్‌ కావచ్చు ఖాన్‌ ఒకే ఫార్ములాను అనుసరిస్తాడు అదే అప్పు లేని స్వేచ్ఛా జీవితం కోరుకోవటం. 2001 లో పదమూడు కోట్లకు కొన్న ఆస్తి నేడు ”మన్నత్‌”గా (షారుఖ్‌ స్వగహం) పిలువబడుతుంది. దానిని కొనుగోలు చేయడానికి తను నటించబోయే నాలుగు ఐదు సినిమాలలో నిర్మాతల వద్ద అడ్వాన్సుగా తీసుకున్న డబ్బులతో కొన్నదే ఆ ఇల్లు. మార్కెట్లో దాని ఖరీదు ప్రస్తుతం రెండు వందల కోట్లకు పైగా ఉంటుందనేది అంచనా.

1999 లో షారుఖ్‌ ఖాన్‌, జూహి చావ్లా, దర్శకుడు అజిత్‌ మీర్జాతో కలిసి ఓ కంపెనీ ప్రారంభించాడు అదే ”డ్రీమ్స్‌ అన్‌ లిమిటెడ్‌” 1999-2001 మధ్య ఈ సంస్థ నుండి మూడు సినిమాలు నిర్మింపబడ్డాయి. అందులో ఫిర్‌ భి దిల్‌ హై హిందుస్తానీ, అశోక, చల్తే చల్తే, ఈ మూడు సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. ఫలితంగా నష్టం ముప్పై కోట్లకు పైగా వచ్చిందని సినీ విశ్లేషకుల అంచనా. విమర్శకులు ఆ సమయంలో షారుఖ్‌ ఖాన్‌ పై సినిమాల నిర్మాణం ఎందుకు నటిస్తే చాలు అంటూ ఘాటైన విమర్శలు చేశారు. సినిమా నిర్మాణంలో ”జీరో” నటించటంలో ”హీరో” అంటూ గుసగుసలు కూడా వినపడ్డాయి. ఆ సమయంలో తన మిత్రులపై ఉంచిన నమ్మకం విఫలమైందని గ్రహించి చేసిన తప్పులు మళ్ళీ చేయ్యొద్దని దానిని మూసివేసి మరోకొత్త ప్రొడక్షన్‌ హౌజ్‌ ను ప్రారంభించాడు. ఇందులో తన భార్య గౌరీ ఖాన్‌ ను భాగస్వామిగా చేస్తూ ”రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్టైన్మెంట్‌” సంస్థ ద్వారానే సినిమా పంపిణి, మార్కెటింగ్‌, ప్రొడక్షన్‌ అన్ని బాధ్యతలు చూసుకోవడం వల్ల జవాన్‌ సినిమా పంపిణీ వల్లనే 450 కోట్లు సంపాదించగలిగాడు. వీటికి అదనంగా సినిమా విడుదలకు ముందే ఫిల్మ్‌ హక్కులు, మ్యూజిక్‌ హక్కులు, అలాగే బ్రాండ్‌ ఒప్పందం ద్వారా వచ్చిన అన్నింటిని సొమ్ము చేసుకునేవాడు. ఒకవేళ తమ నిర్మాణంలో వచ్చిన సినిమా సరిగ్గా ఆడకపోయినా ముందే TV హక్కులు, ఫిల్మ్‌ హక్కులు అమ్మడం ద్వారా వచ్చిన డబ్బులు దానిని నిర్మాణంతో సరిపోయేవి. ఇక ‘నష్టం’ అనే మాట దగ్గరికి వచ్చేది కాదు. దీనిని వ్యాపార సూత్రాలలో Advance Thinking అనవచ్చును. ఇతడు నటించిన ‘రావణ్‌’ సినిమా సరైన వసూళ్ళు రాబట్టకపోవడంతో ఆర్ధికంగా నష్టాలను చూడలేదు. కారణం సినిమా విడుదలకు ముందే దాని హక్కులను ఇతరులకు అమ్మడం ద్వారా తను నష్టం నుండి కోలుకున్నట్లు ప్రకటిస్తాడు ఓ ఇంటర్వూలో. అందుకే షారుఖ్‌ ఖాన్‌ను రొమాంటిక్‌ హీరోగానే చూడకుండా ‘రెవిన్యూ కింగ్‌’గా అభివర్ణిస్తారు సినీ పండితులు.

ఇక షారూఖ్‌ ఖాన్‌ లోని మరో కోణం VFX స్టూడియో నిర్మాణం. ఇది అతడి వ్యాపారపరమైన దూరదష్టికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. హాలివుడ్‌ లో లభ్యమయ్యే Vఖీశ స్టూడియో మనదేశంలో లేకపోవడాన్ని గమనించిన అతడు ముంబాయిలో నిర్మించగా బాహుబలి, ===, ఆదిపురుష్‌, కల్కి లాంటి సినిమాలు ఈ స్టూడియోలో రూపుదిద్దుకొన్నవే అన్న విషయం చాలామందికి తెల్సి ఉండకపోవచ్చు. ZEERO సినిమాలో షారుఖ్‌ ఖాన్‌ పొట్టివాడి పాత్ర, అలాగే జవాన్‌ సినిమాలో సల్మాన్‌ ఖాన్‌, షారుఖ్‌ ఖాన్‌ ట్రైన్‌ పోరాట సన్నివేశాలు VFX ద్వారానే చిత్రీకరించబడినవి. మనదేశంలో సంవత్సరానికి అన్ని భాషలలో రెండు వేల సినిమాలు నిర్మింపబడతాయి. ఇందులో పది శాతం VFX వల్ల వచ్చినవి ఐతే షారుఖ్‌ ఖాన్‌ స్టూడియో నిర్మాణానికి పెట్టిన పెట్టుబడి వెళ్తుందని ముందే ఊహించి 2006లో రెడ్‌ చిల్లీస్‌ VFX స్టూడియో నిర్మించాడు. దీని విలువ VFX రావడానికి ముందు 33 కోట్లు (2006 లో) 2013లో 198 కోట్లు, ఆలోచించండి షారుఖ్‌ ఖాన్‌ ఆదాయం వార్షికంగా ఎలా పెరుగుతూ వచ్చిందో ప్రస్తుతం – 2024 లో 1000 కోట్ల ఆదాయం పై మాటే అనేది ఓ అంచనా.

ఇక చివరిగా షారుఖ్‌ ఖాన్‌ ద్వారా మనం ఏం నేర్చుకోగలం అన్నది ప్రశ్న. 2015 లో షారుఖ్‌ ఖాన్‌ హీరోగా వచ్చిన సినిమా ‘చక్‌ దే ఇండియా’ అందులో టైటిల్‌ సాంగ్‌ ప్రతి క్రీడల పోటీలలో మనకు వినిపించటం చూస్తూనే వున్నామ్‌. 2006 సంవత్సరం క్రికెట్‌ లో పొట్టి ఫార్ములా మొదలైంది.T-20 IPL ను BCCI ఆలోచన చేసి అన్ని దేశాల క్రికెట్‌ క్రీడాకారుల్ని మనదేశం రప్పించి వీరిని వేలం ద్వారా వివిధ యాజమాన్యాలు కొనుగోలు చేసి ఆడించడం మనం చూశాం. అదే సమయంలో IPL లో ప్రవేశించి అందులో బిజినెస్‌ చేయడం మొదలుపెట్టాడు. అలా వచ్చిన ఆలోచనతో కోల్‌ కత నైట్‌ రైడర్స్‌ 300 కోట్లకు కొనుగోలు చేసిన అతడు దానిని పతాక స్థాయికి తీసుకొని వెళ్లి వివిధ మార్గాల ద్వారా నేడు దాని మార్కెట్‌ విలువ పది వేల కోట్లు అంటే ఎవరైనా నమ్మగలరా చెప్పండి. మరి అతడు ఆ జట్టుకు పెట్టిన పెట్టుబడి ఎంత 300 కోట్లు. దాని మార్కెట్‌ విలువ ప్రస్తుతం పది వేల కోట్లు. ఆలోచించండి ఇప్పుడు షారుఖ్‌ ఖాన్‌ వ్యాపార ఆలోచన ఎంత ముందు చూపుతో కూడి ఉందో, అందుకే డబ్బు సంపాదించదానికి నటించటం కాదు బుద్దిని కూడా ఉపయోగించాలి. అది మన మైండ్‌ సెట్‌ లో వుండాలి. ఇలా చెప్పుకుంటూపోతే చాలామంది గూర్చి ప్రస్తావించవచ్చు. వారి గురించి తర్వాత భాగాలలో తెల్సుకుందాం.

– డా||మహ్మద్‌ హసన్‌,
9908059234

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -