నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పిల్లలు లేని దంపతులకు సరోగసీ ద్వారా సంతానం పొందే హక్కును చట్టం కల్పించిందని పేర్కొంటూ హైకోర్టు తీర్పు వెలువరించింది. జన్యులోపాలున్న దంపతులకు సరోగసీ ద్వారా పిల్లలు పొందే అవకాశాన్ని నిరాకరించకూడదని తెలిపింది. ఇందుకు అవసరమైన అర్హత, ధృవీకరణ పత్రం జారీ చేయాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖను ఆదేశిస్తూ జస్టిస్ నగేష్ భీమపాక తీర్పు వెలువరించారు. హైదరాబాద్‌కు చెందిన వైద్య దంపతుల్లో సదరు మహిళకు… కంప్లీట్ ఆండ్రోజెన్ ఇన్సెన్సిటివిటీ సిండ్రోమ్ (సీఏఐఎస్) అనే అరుదైన జన్యు సమస్య వల్ల గర్భాశయం, అండాశయాలు లేవని పేర్కొన్నారు. భార్యకు సహజ గర్భధారణ సాధ్యం కానప్పడు సరోగసీ ద్వారా సంతానం పొందే హక్కు చట్టంలో ఉందని గుర్తు చేశారు. అందువల్ల అధికారులు ధృవీకరణ పత్రం ఇవ్వకపోవడం సరోగసీ (నియంత్రణ) చట్టం ఉద్దేశానికి విరుద్ధమని పేర్కొన్నారు.
సినిమా ధియేటర్లలో పార్కింగ్ ఫీజు వద్దు
మున్సిపాల్టీల పరిధిలోని సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు తాత్కాలికంగా ఆదేశాలు జారీ చేసింది. సినిమా టిక్కెట్ తీసుకున్న ప్రేక్షకుల నుంచి అదనంగా పార్కింగ్ రుసుము వసూలు చేయకుండా చూడాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని థియేటర్లకు సమాచారం ఇవ్వాలని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించింది. హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లోని కోణార్క్ థియేటర్లో పార్కింగ్ ఫీజు వసూలు చేయడాన్ని సవాలు చేస్తూ రామావత్ ప్రేమ్‌కుమార్ వేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎన్.వి. శ్రవణ్‌కుమార్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. 2021లో జీవో 121ను విడుదల చేయటం ద్వారా పార్కింగ్ వసూలుకు అనుమతి ఇవ్వడాన్ని నిలిపివేశారు.
సరోగసీకి అనుమతివ్వాలి :హైకోర్టు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



