Sunday, March 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంచట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలి

చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలి

- Advertisement -

– ప్రపంచ వ్యాప్తంగా పురుషాధిక్యత
– రాజకీయాల్లో మరింత ఎక్కువ : మహిళా దినోత్సవ వేడుకల్లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
– వివిధ రంగాల్లో రాణించిన 40 మందికి పురస్కారాలు
నవతెలంగాణ-చందానగర్‌

చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలని, మహిళలు ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా ముందుకు సాగాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా పురుషాధిక్యత ఉందని, రాజకీయాల్లో ఇది మరింత ఎక్కువగా ఉందని అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్‌లో మాజీ కార్పొరేటర్‌ బొబ్బ నవతారెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వ హించారు. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన సోషల్‌ వర్కర్స్‌, ఆర్టిస్టులు, జర్నలి స్టులు, శానిటేషన్‌ వర్కర్లు, ప్రజా ప్రతినిధులు సుమారు 40 మందికి ఈ సందర్భంగా పురస్కా రాలు అందజేశారు. వివిధ జిల్లాలకు చెందిన, వివిధ రంగాలలో ఉత్తమంగా రాణిస్తున్న మహిళ లను ఎంతో కష్టపడి ఎంపిక చేసిన నవతారెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. చందానగర్‌ విద్యా నగర్‌ కాలనీలో ఏర్పాటు చేసిన శేరిలింగంపల్లి బీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని కేటీఆర్‌ ప్రారంభించారు. పార్టీలో చేరిన వారికి కండువా కప్పి బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్‌ ప్రసంగించారు. ఒక రంగంలో పురుషుడు విజయం సాధించడానికి 100 శాతం కష్టపడితే, అదే రంగంలో మహిళ రాణించాలంటే 200 శాతం శ్రమించాల్సిన పరిస్థితి ఉందన్నారు. పోటీ ప్రపంచంలో మహిళలు నిలదొక్కుకోవాలంటే రెట్టింపు ప్రయత్నం చేయక తప్పదని అన్నారు. ఆడబిడ్డలకు ఆర్థిక స్వతంత్రమే అసలైన గౌరవం, గుర్తింపు ఇస్తుందని అన్నారు. తనకు కూడా 17 ఏండ్ల కూతురు ఉందని గుర్తు చేస్తూ, యువతకు ఆయన కీలక సూచన చేశారు. చట్టసభల్లో మహిళలు పెరగాలని, రాబోయే రోజుల్లో మహిళా రిజర్వేషన్లు అమలులోకి రానున్న నేపథ్యంలో, చదువుకున్న విద్యావంతులు, సామాజిక స్థితిగతులపై అవగాహన ఉన్న మహిళలు రాజకీయాల్లోకి రావాలని కోరారు.బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు. మరోసారి రాష్ట్రంలోని మహిళల ఆశీస్సులతో కేసీఆర్‌ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని, ఆడబిడ్డల కోసం మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తీసుకొస్తుందని కేటీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే కృష్ణారావు, మాజీ కార్పొరేటర్లు సింధు ఆదర్శరెడ్డి, సాయిబాబా, అమీన్‌పూర్‌ మున్సిపల్‌ మాజీ చైర్మెన్‌ పాండు రంగారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మమత, పురుషోత్తం యాదవ్‌, రవి యాదవ్‌, శ్రీనివాస్‌, శ్రీకాంత్‌, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -