Monday, March 9, 2026
E-PAPER
Homeతాజా వార్తలు​"చెట్టు మీద దెయ్యం నాకేం భయం​" మూవీ పోస్టర్ విడుదల

​”చెట్టు మీద దెయ్యం నాకేం భయం​” మూవీ పోస్టర్ విడుదల

- Advertisement -

​”ఒకప్పుడు నరుడి బ్రతుకు నటన… ఇప్పుడు చెట్టు మీద దెయ్యం నాకేం భయంతో విడుదలకు సిద్ధం” అంటూ వస్తున్న యువ దర్శకుడు తల్లాడ సాయి కృష్ణ, తన గత చిత్ర టైటిల్ ‘నరుడి బ్రతుకు నటన’ విషయంలో జరిగిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని మీడియాతో పంచుకున్నారు. ​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… “సితార ఎంటర్టైన్మెంట్స్ వాళ్లు ఆ టైటిల్ కోసం నాకు ఇచ్చింది లక్ష రూపాయలు మాత్రమే. మిగిలిన డబ్బు ఇవ్వలేదు. ఇండస్ట్రీలో మంచి రిలేషన్స్ ఉండాలనే ఉద్దేశ్యంతో నేనే మిగతా డబ్బు వద్దు అనుకున్నాను. కానీ ఇటీవల త్రివిక్రమ్ గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ… ఈ టైటిల్ కోసం వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ తీసుకున్నాం అని అన్నారు. నేను పూర్తి డబ్బులు తీసుకోలేదు అనే విషయం బహుశా త్రివిక్రమ్ గారికి తెలియదు అనుకుంటున్నాను” అని తల్లాడ సాయి కృష్ణ స్పష్టం చేశారు.

​”చెట్టు మీద దెయ్యం నాకేం భయం” ఉత్కంఠభరితమైన సరికొత్త పోస్టర్ విడుదల:
​శ్రీ లక్ష్మీ శ్రీనివాస ఫిల్మ్స్ బ్యానర్‌పై తల్లాడ శ్రీనివాస్ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం “చెట్టు మీద దెయ్యం నాకేం భయం”. ఈ చిత్రానికి తల్లాడ సాయి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. తల్లాడ సాయి కృష్ణ, మాధురి, బాలు, రంజిత్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన సరికొత్త పోస్టర్‌ను చిత్ర బృందం అధికారికంగా విడుదల చేసింది.
​కొత్తగా విడుదలైన ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. చీకటి రాత్రి, భయంకరమైన చెట్టు నేపథ్యంగా… చేతిలో లాంతరు పట్టుకుని హీరో (తల్లాడ సాయి కృష్ణ) నిలబడి ఉండగా, వెనుక దెయ్యం మరియు భయంతో అరుస్తున్న మరో వ్యక్తి ఉన్న దృశ్యం ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని రేకెత్తిస్తోంది.

​మన చిన్ననాటి మాటలను గుర్తుచేసేలా “చెట్టు మీద దెయ్యం నాకేం భయం” అనే క్యాచీ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా, హారర్ మరియు కామెడీల అద్భుతమైన కలయికగా రాబోతోంది. ప్రేక్షకులను భయపెడుతూనే కడుపుబ్బా నవ్వించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ మరియు పిల్లలతో సహా అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఖచ్చితంగా అలరిస్తుందని చిత్ర బృందం నమ్మకం వ్యక్తం చేస్తోంది. ​ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ గణేష్ భారీ గారు ఈ చిత్రాన్ని ప్రెసెంట్ చేస్తుండటం పట్ల సినిమా పై మరింత ఆసక్తి నెలకొంది. అలాగే ఈ చిత్ర ఆడియో హక్కులను ప్రముఖ ఆడియో సంస్థ ‘శబరి మ్యూజిక్’ దక్కించుకుంది.
​నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు:
​సమర్పణ: గణేష్ భారీ
​బ్యానర్: శ్రీ లక్ష్మీ శ్రీనివాస ఫిల్మ్స్
​టైటిల్: చెట్టు మీద దెయ్యం నాకేం భయం
​నిర్మాతల: తల్లాడ శ్రీనివాస్
​కో-ప్రొడ్యూసర్: అశోక్ నిమ్మల
​దర్శకత్వం: తల్లాడ సాయి కృష్ణ
​సంగీత దర్శకుడు: లలిత్ కిరణ్
​ఆడియో లేబుల్: శబరి మ్యూజిక్
​త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన టీజర్, ట్రైలర్ మరియు థియేట్రికల్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు. సమ్మర్ లో థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -