- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: పశ్చిమాసియాలో తీవ్ర అనిశ్చితి కొనసాగుతోంది. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్‌లు పరస్పరం భీకర దాడులు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాల నుంచి 52,000 మంది భారత పౌరులు స్వదేశానికి చేరుకున్నారు. ఆ ప్రాంతమంతటా పాక్షికంగా విమానాల రాకపోకలకు అనుమతులు ఇవ్వడంతో వారు ఇండియాకు చేరుకున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పశ్చిమాసియాలో చిక్కుకున్న పౌరులు స్థానిక అధికారుల మార్గదర్శకాలను, భారత మిషన్లు జారీ చేసే అడ్వైజరీలను పాటించాలని సూచించింది.
- Advertisement -



