– రూ.16లక్షల నిధుల మంజూరు
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
రాజ్యసభ ఎంపీ కేతిరెడ్డి సురేష్ రెడ్డిని మండలంలోని పలువురు సర్పంచులు ఆదివారం కలిశారు. ఈ మేరకు హైదరాబాదులోని ఆయన నివాసంలో ఎంపీ సురేష్ రెడ్డిని హాస కొత్తూర్ సర్పంచ్ నలిమెల రేవతి గంగారెడ్డి, చౌట్ పల్లి సర్పంచ్ మహబూబ్ కలిసి గ్రామాల్లో అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని విన్నవించారు. వెంటనే స్పందించిన ఎంపీ సురేష్ రెడ్డి తన ఎంపీ లాండ్స్ హాస కొత్తూర్ గ్రామంలో వివిధ పనుల కోసం రూ.16 లక్షల నిధులను మంజూరు చేశారు. గ్రామంలో అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేసిన ఎంపి సురేష్ రెడ్డికి సర్పంచ్ నలిమేల రేవతి గంగారెడ్డి గ్రామస్తుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ సురేష్ రెడ్డి ని కలిసిన వారిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తెడ్డు రమేష్, ఏలేటి గంగారెడ్డి, బిఆర్ఎస్ నాయకులు గోపిడి లింగారెడ్డి, తదితరులు ఉన్నారు.
ఎంపీ సురేష్ రెడ్డిని కలిసిన సర్పంచులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



