నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట నియోజకవర్గంలో ఆదివారం నిర్వహించిన పలు శుభకార్యాలలో స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పాల్గొని కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు. దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో నందమూరి కుటుంబానికి చెందిన అన్నప్రాసన వేడుకలో ఆయన పాల్గొన్నారు.
అనంతరం అశ్వారావుపేట నియోజకవర్గం కేంద్రంలోని శ్రీశ్రీ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన రంగా కుటుంబ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే సున్నంబట్టి గ్రామంలో పొట్టా కుటుంబం నిర్వహించిన నూతన వస్త్రాలంకరణ కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వాదాలు అందించారు. తదుపరి పాత మామిళ్ళవారి గూడెం గ్రామంలో బోడపాటి కుటుంబం నిర్వహించిన వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమాలలో అశ్వారావుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు,రావు గంగాధర్ రావు, ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు, కాంగ్రెస్ నాయకులు,స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.



