Monday, March 9, 2026
E-PAPER
Homeఖమ్మంఎన్నో పోరాటాల ఫలితమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం 

ఎన్నో పోరాటాల ఫలితమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం 

- Advertisement -

నవతెలంగాణ – అశ్వరావుపేట
స్త్రీ ని దేవతగా కొలిచే మన దేశం లో అదే జాతి యువతులు, పసిపిల్లలు పై నిత్యం హత్యచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయని, కానీ వాటినరికట్టడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని, అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే పేరంటం కాదని ఎన్నో పోరాటాల వారసత్వమని సీఐటీయూ మండల కమిటీ సభ్యురాలు కే.భారతి అన్నారు. 

స్థానిక ప్రజా సంఘాల కార్యాలయం సుందరయ్య భవన్ లో ఆదివారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో క్రిష్ణ వేణి అధ్యక్షతన అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా భారతి మాట్లాడుతూ నేడు మహిళలు అనుభవిస్తున్న హక్కులు ఆనాటి సోషలిస్ట్,కమ్యూనిస్టు మహిళల పోరాటాల ఫలితమే నని అన్నారు. 

అనంతరం రైతు సంఘం రాష్ట్ర నాయకులు కే.పుల్లయ్య మాట్లాడుతూ వేతన బానిసత్వానికి వ్యతిరేకంగా జరిగే ఉద్యమంలో శివంగులై దూకేలా చేసిన పాత్ర మార్చి 8 కి దారితీసిందని వివరించారు.

నాడు మహిళలు అధిక పని గంటలకు వ్యతిరేకంగా కనీస వేతనాలు కావాలని తమ మానప్రాణాలకు రక్షణ కోసం ప్రాణాలు అర్పించారని ఆ పోరాటాల ఫలితంగానే మహిళలకు ఓటు హక్కు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగ, ఉపాధి,ఉద్యోగ భద్రత వచ్చిందని అన్నారు. 

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు చిరంజీవి ప్రజాసంఘాల నాయకులు మురహరి రఘు,మడిపల్లి వెంకటేశ్వరరావు,రాఘవ వెంకాయమ్మ,పావని,భూదెమ్మ నాగలక్ష్మి,మంగ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -