Monday, March 9, 2026
E-PAPER
Homeఖమ్మంవ్యవసాయ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

వ్యవసాయ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
స్థానిక వ్యవసాయ కళాశాలలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జే. హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆదేశాల మేరకు ఈ సందర్భంగా మహిళా రైతు మేళాను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ భరత్, అశ్వారావుపేట వ్యవసాయ అధికారి శ్రీనివాస్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీం ఇంచార్జి అలేఖ్య, ఉద్యాన విస్తరణ అధికారి ఈశ్వర్ పాల్గొన్నారు.

కళాశాల విద్యార్థులు వివిధ వ్యవసాయ ఉత్పత్తులు, ఆధునిక సాంకేతికతలపై ప్రత్యేక ఎగ్జిబిషన్ నిర్వహించారు. కార్యక్రమంలో మహిళా అభ్యుదయ రైతులు రాములమ్మ, డ్రోన్ పైలట్ పుష్పరాణి, పారిశ్రామికవేత్త ప్రశాంతి, రిటైర్డ్ టీచర్ లక్ష్మీభాయి, కళాశాల సీనియర్ ఫ్యాకల్టీ డాక్టర్ రామ్ ప్రసాద్, డాక్టర్ శ్రీనివాస్ రావు, డాక్టర్ జంబమ్మ, డాక్టర్ జమీమా, డాక్టర్ నాగాంజలి, డాక్టర్ నీలిమ తదితరులు ఆధునిక వ్యవసాయ సాంకేతికతలపై ప్రసంగించారు.

సుస్థిర వ్యవసాయం, యూరియా వినియోగం, ప్రకృతి వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, డ్రోన్ సాంకేతికత, విలువ ఆధారిత ఉత్పత్తులు, సాగు యాజమాన్యం వంటి అంశాలపై వివరించారు. అలాగే మహిళల సాధికారత, రక్షణ, మహిళలకు సంబంధించిన చట్టాలు, మహిళా అభివృద్ధి పథకాల గురించి కూడా వక్తలు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాన్ని విమెన్ ప్రొటెక్షన్ సెల్ బాధ్యులు డాక్టర్ నాగాంజలి, డాక్టర్ జంబమ్మ, డాక్టర్ జమీమా, డాక్టర్ ఝాన్సీరాణి సమన్వయం చేశారు.

ఈ సందర్భంగా అభ్యుదయ మహిళా రైతులను సన్మానించారు. ఆయిల్ పామ్ సాగులో ప్రతిభ కనబర్చిన కె. సీతా మహాలక్ష్మి (కొత్తగూడెం), డ్రోన్ పైలట్ ఎం. పుష్పరాణి, మిల్లెట్ ప్రాసెసింగ్ పారిశ్రామికవేత్త కె. ప్రశాంతి, మల్లాయిగూడెం గ్రామానికి చెందిన జె. పార్వతి, సహజ వ్యవసాయం చేస్తున్న కె. రాములమ్మ, జీవా ప్రాజెక్ట్ ద్వారా సాంప్రదాయ వరి సాగు, మిల్లెట్ ప్రాసెసింగ్, సమగ్ర వ్యవసాయ విధానాన్ని అమలు చేస్తున్న మహిళా రైతులు, కొబ్బరి హస్తకళల శిక్షణ పొందిన శ్రీమతి భూలక్ష్మి, సూర్యకాంతం, పేర అచ్చమ్మ, అశ్వారావుపేట అంగన్‌వాడీ టీచర్ నాగమణి, కవాడిగుండ్ల అంగన్‌వాడీ హెల్పర్ లక్ష్మి లను ఘనంగా సత్కరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -