- Advertisement -
దిల్లీ రాజు బృందం..
నవతెలంగాణ – మల్హర్ రావు
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం మండలంలోని ఆన్ సాన్ పల్లి గ్రామంలో నిత్యం గ్రామ ప్రజలకు సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లకు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఢిల్లీ రాజు బృందం ఆధ్వర్యంలో వారికి శాలువాలు, పూల దండలతో ఘనంగా సన్మానం చేసి, స్వీట్లు పంపిణి చేశారు.
ఈ సందర్భంగా డిల్లీ రాజు మాట్లాడుతూ.. అంగన్ వాడి, ఆశాలు తక్కువ వేతనాలతో ప్రజలకు చేస్తున్న సేవలు మరువలేనివన్నారు. మహిళలు అన్నీంట్లో రాణించాలని అన్నారు. మహిళలు ఎందులో తక్కువ కాదని భవిష్యత్ లో తన బృందం ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, బృందం పాల్గొన్నారు.
- Advertisement -



