నవతెలంగాణ – మిడ్జిల్
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా వాడ్యాల్ చర్చిలో ఘనంగా మహిళా దినోత్సవాన్ని మహిళా సంఘస్తులు నిర్వహించారు. కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ, స్త్రీలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని, సేవా కార్యక్రమంలో కూడా మహిళలు ముందుండాలని చెప్పారు.
స్త్రీ లేకపోతే జననం లేదు స్త్రీ లేకపోతే గమనం లేదు స్త్రీ లేకపోతే సృష్టి లేదని చెప్పారు. ప్రభుత్వాలు ,పాలకులు మహిళా సంక్షేమం కోసం కృషి చేయాలని కోరారు. వారి హక్కులను భంగం కలిగించకుండా కఠినమైన చట్టాలను తీసుకురావాలని కోరారు. అనంతరం మహిళా సమస్యల కోసం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ అమ్మలు రాజమణి, గ్రేస్ లవ్లీ, నాగమ్మ, చంద్రమ్మ, స్వరూప రాణి, రుతమ్మ, శోభారాణి, వజ్ర, మరియమ్మ, సుగుణమ్మ పోచమ్మ, లలితమ్మ, తదితరులు పాల్గొన్నారు.



