Monday, March 9, 2026
E-PAPER
Homeదర్వాజసరుకు

సరుకు

- Advertisement -

నీ గురించి నువ్వు చెప్పుకుంటే
పూల పరిమళం గురించి ఓ పువ్వే వలపోసినట్లుంటది.
నీ గురించి చెప్పమని ఎవ్వరికైనా నువ్వు చెప్పుకుంటే
చేదురుబావిలో బొక్కెన
గజ ఈతగాన్నని చాటింపు వేసుకున్నట్లుంటది.
ఇదంతా ఆత్రం నుండి పుట్టిన యాతన సరుకు లేనప్పుడు
తనపై తనకు నమ్మకం లేనప్పుడు
చేసిన పనిమీద ఏ లక్ష్యమూ లేనప్పుడు
దాన్ని అడ్డం పెట్టుకొని మరేదో ఆశించినప్పుడు
నువ్వుత్త పువ్వువు, నువ్వుత్త చేద బొక్కెనవు
ఏదైనా మొక్కనాటి మరునాడే
పూలు పూయామనే వెర్రివాడా
విత్తనంలో శక్తి దట్టించిఉన్నదీ లేనిదీ
గాలినీ నీటినీ తెలుసుకోనిరు
అవి ఊపిరులూదేదాకా ఓపిక లేనివాడా
అడిగి తీసుకునేది చులకన, ఆగి ఆగి చూసేదీ చులకనే
కాలం జల్లెడలో నువ్వెక్కడ ఉండాలో
కాలం మాత్రమే నిర్ణయిస్తుంది.
నీ గురించి నువ్వంతగా ఆత్రపడుతున్నావంటే
సందేహం లేదు నువ్వు తప్పనిసరిగా
జల్లెడలోంచి జారిపోయే వాడివే.
సరుకున్న వాడివైతే, జల్లెడలో జారిపోనివాడివైతే
నువ్వసలే ఆత్రపడవు
– ఏనుగు నరసింహారెడ్డి, 8978869183

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -