నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా జర్నలిస్టుల ఇండ్ల స్థలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటుందన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన పట్ల తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్ ) హర్షం వ్యక్తం చేసింది. ఈమేరకు ఆదివారం ఫెడరేషన్ అడహక్ కమిటీ కన్వీనర్ పిల్లి రాంచందర్, ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడిగ రఘు, బి. రాజశేఖర్, రాష్ట్ర కార్యదర్శులు ఈ.చంద్రశేఖర్, జగదీష్, గండ్ర నవీన్ తదితరులు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీలు ఇచ్చిందని వారు గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో జర్నలిస్టులకు ప్యూచర్ సిటీలో ఇండ్ల స్థలాలు ఇస్తామంటూ సీఎం ప్రకటించడం సంతోషదాయకమని పేర్కొన్నారు. కొన్ని దశాబ్దాలుగా జర్నలిస్టులు ఇండ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. ఇండ్ల స్థలాలతో పాటు ఉచిత వైద్యం, ఇతర వృత్తిపరమైన సమస్యలను కూడా పరిష్కరించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలిస్తామనడం సంతోషదాయకం
సీఎం ప్రకటనపై జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ హర్షం
జర్నలిస్టుల ఇండ్ల స్థలాల విషయంలో సానుభూతితో ఉందంటూ సీఎం ప్రకటించడం సంతోషదాయకమని జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు రవికాంత్‌రెడ్డి, ఉపాధ్యక్షులు నేమాని భాస్కర్, డైరెక్టర్ శ్రీకాంత్ హర్షం వ్యక్తం చేశారు.
సీఎం ప్రకటనపై టిడబ్ల్యూజేఎఫ్ హర్షం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



