- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఉదయం 9:31 గంటల సమయానికి సెన్సెక్స్ 605 పాయింట్లు క్షీణించి 76,964 వద్ద, నిఫ్టీ 177 పాయింట్లు పడిపోయి 24,029 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సూచీలో టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఓఎన్‌జీసీ, అపోలో హాస్పిటల్స్, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ఉండగా, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 95.72 వద్ద ప్రారంభమైంది.
- Advertisement -



