Friday, September 11, 2026
E-PAPER
Homeజాతీయంరెండు బస్సులు ఢీ.. ఐదుగురు మృతి

రెండు బస్సులు ఢీ.. ఐదుగురు మృతి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : తమిళనాడులోని మదురై సమీపంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న ప్రభుత్వ బస్సు, ప్రయివేటు బస్సు బలంగా ఢీకొనడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా, వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -