- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : బైక్‌పై వెళ్తూ చెట్టును ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు యువకులు మృతి చెందారు. తూ.గో జిల్లా కోరుకొండ మండలం గాదరాడ గ్రామానికి చెందిన బక్కా అర్జన్న(30), సారిపల్లి వీరదుర్గ(26), కుర్రం వీరనాగు(24) స్నేహితులు. ముగ్గురూ కలిసే పనికెళ్తుంటారు. సోమవారం వీరనాగు పుట్టినరోజు కావడంతో అవసరమైన వస్తువులను కొనడానికి ఆదివారం ముగ్గురూ బైక్‌పై కోరుకొండ బయలుదేరారు. నరసాపురం ఉన్నత పాఠశాల సమీపంలో మలుపు వద్ద బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలించగా.. వారు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
- Advertisement -



