- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని టేకులపల్లి మండలం రోల్లపాడు చెరువులో సోమవారం తెల్లవారుజామున భారీ కొండ చిలువ వలలో చిక్కుకుని మృతి చెందింది.
స్థానికులు తెలిపిన ప్రకారం… టేకులపల్లి మండలంలోని రోల్లపాడు చెరువులో మత్స్యకారులు వేసిన వలలో ఒక పెద్ద కొండ చిలువ చిక్కుకుంది. దాదాపు 12 అడుగుల పొడవు, సుమారు 50 కిలోల బరువు ఉన్న ఈ కొండ చిలువ ఆదివారం రాత్రి వలలో చిక్కుకుంది. బయటకు రాలేక అందులోనే విలవిలలాడి మరణించింది. సోమవారం ఉదయం ఈ విషయాన్ని స్థానికులు గమనించారు. ఈ విషయం తెలియగదనే కొండచిలువను చూసేందుకు పెద్ద సంఖ్యలో స్థానికులు తరలివచ్చారు.
- Advertisement -



