Monday, March 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి

- Advertisement -

టిఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎ.మురళీకృష్ణ 
నవతెలంగాణ – నెల్లికుదురు 

సమాన పనికి సమాన వేతనం తక్షణమే ఇవ్వాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నట్లు టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఏ మురళీకృష్ణ డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. సోమవారం కేజీబీవీ పాఠశాలలో మధ్యాహ్న సమయంలో నల్ల బ్యాడ్జి ధరించి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  టిఎస్ యూటిఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ లలో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది, సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించ తలపెట్టిన మూడు దశల పోరాటంలో భాగంగా సోమవారం  KGBV నెల్లికుదురు పాఠశాలలో మధ్యాహ్న భోజనం విరామ సమయంలో సిబ్బంది, ఉపాధ్యాయులందరు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు.]

కేజీబీవీ, యుఆర్ఎస్ ,సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం  తాత్సార వైఖరిని అవలంబిస్తుందని, వీరికి కనీసవేతనాలు కూడా  అమలు చేయటంలేదని వారు తీవ్రమైన శ్రమదోపిడీకి గురౌతున్నారన్నారు. దీనిపై నిరసించిన ఉద్యోగులు గత సంవత్సరం 29 రోజులపాటు సమ్మె చేయగా ఆ సందర్భంగా ఉపముఖ్యమంత్రి తో చర్చల సమయంలో అంగీకరించిన అంశాలు కూడ ఇప్పటివరకు పరిష్కారానికి నోచుకోలేదని, అందుకే ఉద్యోగులందరూ తీవ్రమైన అసంతృప్తితో ఉండి ఆవేదన చెందుతున్నారన్నారు.

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కెజిబివి, యుఆర్ఎస్, ఉద్యోగులందరికీ వారు పనిచేస్తున్న పోస్ట్ కనీస వేతనం (బేసిక్ పే) చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పిఆర్సీ సిఫారసు చేసిన విధంగా రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా కెజిబివి, యుఆర్ఎస్ మరియు సమగ్రశిక్షా ఉద్యోగులందరికి సిఎల్స్ వినియోగానికి అర్హత కల్పించాలని, నెలకు రెండు సిఎల్స్ అనే పరిమితిని ఎత్తివేయాలని మరియు రెగ్యులర్ ఉపాధ్యాయులకు వర్తించే అన్ని రకాల సెలవులను వర్తింప చేయాలని, ఉద్యోగులందరికీ హెల్త్ కార్డులు ఇచ్చి నగదు రహిత వైద్యం అందించాలని, హాస్టళ్ళ నిర్వహణ కోసం కేర్ టేకర్ల  ను నియమించాలని, సిఆర్టీలకు, పిజిసీఆర్టీలకు నైట్ డ్యూటీల నుండి మినహాయింపు ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

ఈ కార్యక్రమంలో పాఠశాల స్పెషల్ ఆఫీసర్ సుమలత మండల అధ్యక్ష ప్రధానకార్యదర్శి రంజిత్ కుమార్ జనార్ధన్ నాయకులు భాస్కర్,మధు,విజయ్, కేజీబీవీ ఉపాధ్యాయులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -