Monday, March 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీసీరోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన

సీసీరోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
పెద్దవూర మండలం చింతపల్లి గ్రామంలో ఎన్‌ఆర్‌జీఎస్‌ నిధుల కింద రూ.20 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు గ్రామ సర్పంచ్ జాటావత్ రవి నాయక్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి దిశగా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. సీసీరోడ్డు నిర్మాణంతో గ్రామ ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయని పేర్కొన్నారు.

ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దశలవారీగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న నిధులను సమర్థవంతంగా వినియోగించి పనులను నాణ్యతతో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలోఈ కార్యక్రమంలో  ఉప సర్పంచ్ ఎల్లయ్య యాదవ్, వార్డ్ మెంబర్లు కట్టబోయిన నరేష్, ఆడెపు సైదులు, బాలు, నాయకులు జటావత్ పంతు నాయక్, రమేష్ ,చిన్న పాక రమేష్ ,గొర్ల మహేష్ యాదవ్, చందు, జైహింద్, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -