రాజకీయంగా ఎదుర్కోలేకే అసత్య ప్రచారాలు..
దమ్ముంటే నన్ను రాజకీయంగా ఎదుర్కోండి
మున్సిపోల్స్ లో ప్రజలు బుద్ధి చెప్పిన తీరు మార్చుకోరా.?
ఆలేర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
నవతెలంగాణ – యాదగిరిగుట్ట
గుట్ట పట్టణంలోని బీసీ కాలనీ ఇందిరా కాలనీ, యాదగిరి పల్లిలో ఇండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేస్తుందని బిజెపి, బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేయడం సిగ్గు చేటని, 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక్క ఇల్లు కట్టని నాయకులు తాము పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుంటే ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ పై ఆబండాలు మోపాలని చూస్తున్నారని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డిసిసి అధ్యక్షుడు బీర్ల ఐలయ్య మండిపడ్డారు. సోమవారం ఆయన నవతెలంగాణ తో మాట్లాడారు.
గుట్టలో ఒక్క ఇల్లు ముట్టుకున్నా నాదే బాధ్యత
యాదగిరిగుట్ట పట్టణంలో ఎక్కడైనా ఒక్క ఇల్లును కూలగొట్టడానికి ముట్టుకున్న తనదే బాధ్యతని ప్రకటించారు. గతంలో పట్టాలు పంచారని బీసీ కాలనీలో 45 ఏళ్ల కింద ప్రభుత్వం ఇచ్చిన పట్టాలతో ఇల్లు నిర్మించుకున్నారని, అందరికీ పర్మిషన్లు కూడా ఉన్నాయన్నారు. అధికారులు 22 ఏ జాబితాలో తయారులో కొన్ని ఇంటి నెంబర్లు పెడితే ఆ ఇండ్లు అన్నింటినీ కూలగొడతారని బిజెపి, టీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన భూములు రిజిస్ట్రేషన్ కావని తెలియదా? ఇన్ని రోజులు సర్వే నెంబర్లు మార్చి దందాలు చేసిన బిఆర్ఎస్, నాయకులు ఇప్పుడు కొత్త డ్రామా మొదలుపెట్టి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారని, వారి మాటలు ప్రజలు ఎవరు నమ్మరన్నారు.
రాజకీయంగా ఎదుర్కోలేక అసత్య ప్రచారం
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటినుండి ప్రజల్లోనే ఉంటూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తుంటే రాజకీయంగా నన్ను ఎదుర్కోలేకనే ఇలాంటి అసత్య ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. రెండు సంవత్సరాలుగా కుటుంబాన్ని సైతం పక్కనపెట్టి ప్రజలే కుటుంబం గా సాగుతున్నానన్నారు గుట్ట పట్టణంలో అన్ని గల్లీలో సిసి రోడ్లు వేయిస్తున్నామన్నారు. మేజర్ సమస్యలైన యాదగిరి పల్లి రోడ్డును పూర్తి చేసామన్నారు పాతగుట రోడ్డు పనులు ప్రారంభించామన్నారు. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామన్నారు. రెండవ విడతలో భాగంగా మరిన్ని ఇండ్లు ఇస్తామన్నారు.
దమ్ముంటే నన్ను ఎదుర్కోండి
ప్రతిపక్ష బీఆర్ఎస్, బిజెపి నాయకులు దమ్ము ధైర్యం ఉంటే రాజకీయంగా నన్ను ఎదుర్కోవాలి అన్నారు. బిజెపి, బిఆర్ఎస్ నాయకులకు కూడా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అన్నారు. అభివృద్ధి పనుల విషయంలో పోరాడాలి తప్ప ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే దుష్ప్రచారం ఆపాలని, లేకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు.
పంచాయతీ మున్సిపల్స్ లో బుద్ధి చెప్పిన తీరు మార్చుకోరా
ఆలేరు నియోజకవర్గం లో 70% సర్పంచ్లను గెలిచాము. మున్సిపల్ లో ఆలేరులో ఉన్న రెండు మున్సిపాలిటి లను కైవసం చేసుకున్నాము. ప్రజలు రెండు ఎన్నికల్లో బుద్ధి చెప్పినా తీరు మార్చుకోరా అని బిఆర్ఎస్, బిజెపి నాయకుల ను నిలదీశారు. గుట్ట మున్సిపాలిటీలో చీకటి పొత్తు పెట్టుకున్న రెండు పార్టీలకు ఓటర్లు కర్రు కాల్చి వాత పెట్టారన్నారు. ప్రధాన ప్రతిపక్షం అని గుట్ట మేమే కట్టామని చెప్పుకున్నవారు 12 వార్డులో ఒక్క వార్డు గెలవడం సిగ్గుచేటుగా అనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఎన్నికల అప్పుడు రాజకీయాలు చేయాలని ప్రస్తుతం ఆలేరు అభివృద్ధిలో అన్ని పార్టీలు కలిసి రావాలని ఆయన కోరారు.
గుట్టలో ఒక్క ఇల్లు ముట్టుకున్నా నాదే బాధ్యత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



