Monday, March 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి

ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి

- Advertisement -

నవతెలంగాణ- భువనగిరి 
యాదాద్రి భువనగిరి జిల్లాలో వేలాది మంది విద్యావంతులైన నిరుధ్యోగ యువతకు పోటీపరీక్షల సన్నద్దత కోసం జిల్లా వ్యాప్తంగా ఉచిత కోచింగ్ప్ర సెంటర్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) యాదాద్రి భువనగిరి జిల్లా సమితి ఆధ్యర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం లోని ప్రజావాణి లో కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. 

ఈ సందర్బంగా ఏఐవైఎఫ్ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శి ఏల్లంకి మహేష్, పేరబోయిన మహేందర్ లు  మాట్లాడుతూ గ్రూప్ 1,2,3,4,ఎస్ఐ, కాన్స్టేబుల్, ఫైర్ మెన్, జైల్ వార్డెన్,స్కూల్ అసిస్టెంట్  పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగ యువతకు సరైన శిక్షణా అవకాశాలు లేవని అన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువత కోచింగ్ సెంటర్లు లేక, ప్రైవేట్ కోచింగ్ సెంటర్లను ఆశ్రయిస్తే ఆ కోచింగ్ కేంద్రాల్లోని యాజమాన్యం విచ్చలవిడిగా ఫీజులు వసూళ్లు చేస్తున్నాయని,ఆర్థికంగా వెనుకబడిన  వర్గాలకు చెందిన యువతకు సరైన మార్గదర్శకత్వం మరియు శిక్షణ పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

గ్రామీణ, పేద కుటుంబాలకు చెందిన యువతకు బాసట అవసరం అన్నారు.త్వరలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనున్న జాబ్ క్యాలెండర్ అనుగుణంగా, ప్రస్తుతం పోటీ పరీక్షలు కోసం, సమగ్ర కోచింగ్ మరియు ప్రామానిత అధ్యయన కేంద్రాలను జిల్లాలో ఏర్పాటు చేయాలన్నారు. కోచింగ్ సెంటర్లతో ఏర్పాటుతో పాటు నిష్ణాత అధ్యాపకులతో బోధన జరపాలని,పోటీ పరీక్షలకు ఆవసరమైన పుస్తకాలు, టెస్ట్ పేపర్లు అందుబాటులో ఉంచాలన్నారు.కోచింగ్ పొందాలనే అభ్యర్థులు జిల్లా ఎంప్లాయిమెంట్ శాఖ ద్వారా దరఖాస్తు చేసేలా ప్రణాళిక రూపొందించాలని వారు డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్  జిల్లా నాయకులు సుద్దాల సాయి కుమార్, కంబాల వెంకటేష్, కందుల మధు లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -