Monday, March 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కంఠాలిలో ఉపాధి హామీ పనులు పరిశీలన

కంఠాలిలో ఉపాధి హామీ పనులు పరిశీలన

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని కంఠాలి జిపి గ్రామంలో సోమవారం గ్రామ సర్పంచ్ నాగ్ నాధ్ ఉపాధి హామీ పనులను క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడుతూ.. నిత్యం ఉదయం 6 గంటలకల్లా పని ప్రదేశం వద్ద ఉండాలని ఎండలు పెరుగుతున్న క్రమంలో తగు జాగ్రత్తలు వహించాలని అన్నారు. జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఉపాధి పనులకు రావాలని సూచించారు. అదేవిధంగా గ్రామంలోని ఎంపీపీ ఎస్ పాఠశాల లో ఏర్పాటుచేసిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో సర్పంచ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయునిలు గొల్ల లక్ష్మి, ప్రియాంక, గ్రామ మహిళా సంఘం సభ్యులకు శాలువాతో సన్మానించారు.  జ్ఞాపికలను అందించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు జిపి కార్యవర్గ సభ్యులు, ఎంపీపీ ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జెట్టి సంతోష్, ఉపాధ్యాయినీలు గొల్ల లక్ష్మి,  ప్రియాంక , ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులు , మహిళా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -