- Advertisement -
నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం కొలనుపాక గ్రామానికి చెందిన బీడీ కార్మికురాలు బల్ల సుశీల (80) సోమవారం తెల్లవారుజామున 3.20 గంటలకు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమెకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కొలనుపాక గ్రామ సర్పంచ్ బెదరబోయిన యాకమ్మ – వెంకటేష్ బల్ల సుశీల మృతదేహంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు.సుశీల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఆమె కుమారుడు,ప్రభుత్వ ఉపాధ్యాయుడు వెంకటేష్ కు ధైర్యంగా ఉండాలని మనోధైర్యం కల్పించారు.
ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్,నాయకులు బెదరబోయిన శంకర్, బైరి విశ్వనాథం గౌడ్, నోముల వాసుదేవ్ నేత, అంకం రాజు నేత, సిద్ధులు, భోగ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



