Monday, March 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎత్తిపోతున్న బోర్లు..!

ఎత్తిపోతున్న బోర్లు..!

- Advertisement -

అడుగంటుతున్న భూగర్భ జలాలు
నవతెలంగాణ – మల్హర్ రావు

వేసవి ప్రారంభంలోనే మండలంలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. గడిచిన రెండు నెలల్లో ఏకంగా 30 పిట్ల లోతులోకి వెళ్లాయి. జనవరిలో 10 పిట్ల ఫిబ్రవరిలో 20 పిట్ల మేర తగ్గిపోవడం నీటి వినియోగ తీవ్రతను తెలుపుతోంది.వరినాట్లు పూర్తి కావడంతో వ్యవసాయ బోర్ల వాడకం పెరిగింది.దీంతో గాదంపల్లి, కిషన్ రావు పల్లి, కొయ్యుర్, పెద్దతూండ్ల, నాచారం, ఆన్ సాన్ పల్లి, రుద్రారం గ్రామాల్లో మోటార్లకు నీరందక ఎత్తిపోతున్నాయి.

పంట పొలాలకు నీరు అందించడానికి రైతులకు ఇబ్బందులు ఇప్పుడే మొదలయ్యాయి. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే మూడు నెలలు ఎలా ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. జనవరిలో 4.56 మీటర్లలో ఉన్న భూగర్భ జలాలు ఫిబ్రవరి ముగిసే నాటికి 5 మీటర్ల లోతులోకి చేరాయి. ఇది 2025 ఫిబ్రవరి నెలతో (3.94 మీటర్లు) పోలిస్తే కొంచెం మెరుగైన పరిస్థితి అయినప్పటికీ భూరగ్భ జలాలు వేగంగా కిందికి వెళ్తున్నాయి. రానున్న వేసవిలో మరింత  ప్రభావం ఉండొచ్చని ప్రపంచ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని  ప్రజలు, రైతులు భూగర్భ జలాలు తగు మోతాదులో వాడుకోవాలని సూచిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -