నవతెలంగాణ- మిడ్జిల్
గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మహిళ సంఘాలను బలోపేతం చేయడానికి ప్రజా ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని సర్పంచ్ నాగరాజు గౌడు చెప్పారు. మండలంలో చిల్వేరు గ్రామం లొ మహిళా సంఘాల అభివృద్ధి ని దృష్టిలో పెట్టుకొని మహిళా సంఘాం భవనం నిర్మాణానికి సోమవారం మహిళా సంఘం సభ్యులు వార్డు మెంబర్లతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ నాగరాజు గౌడ్ మాట్లాడుతూ.. గ్రామాలలో మహిళా సంఘం సభ్యులకు భవనాలు లేక ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారని ప్రభుత్వం గుర్తించి భవన నిర్మాణానికి నిధులు కేటాయించినట్లు ఆయన తెలిపారు.
గ్రామ అభివృద్ధికి మహిళలు సహకరించాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా గ్రామానికి అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కృషి చేస్తానని తెలిపారు. అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బాదేపల్లి మార్కెట్ డైరెక్టర్ డైరెక్టర్ సత్యం గౌడ్, మాజీ ఎంపీటీసీ సభ్యులు రాజారెడ్డి, వార్డ్ సభ్యులు మల్లేష్, హుస్సేన్, నాగార్జున, జంగమ్మ, విజయ జ్యోతి, మహిళా సంఘ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.



