- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన గుర్రం రాజమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందింది.రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బడితేల రాజయ్య,గ్రామ సర్పంచ్ చంద్రగిరి సంపత్ సోమవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి 50కిలోల సన్న బియ్యం అందజేసి చేయుతనిచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు చంద్రగిరి అశోక్, కాంగ్రెస్ నాయకులు లచ్చయ్య, సంగేo సత్యనారాయణ, చిర్ర ఎల్లారి, చంద్రగిరి రామయ్య, మంతెన సూర్య కిరణ్, పేట దేవేందర్, మంతెన మహేష్ , మంతెన ప్రవీణ్ పాల్గొన్నారు.
- Advertisement -



