Monday, March 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాలుర ఉన్నత పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం

బాలుర ఉన్నత పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌన్  
ఆలేరు మండలం కేంద్ర బాలుర ఉన్నత పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం సోమవారం విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయురాలుగా జయశ్రీ,విద్యా శాఖ మంత్రిగా ఆకృతి,పంచాయతీ శాఖా మంత్రిగా వినోదిని, ప్రభుత్వ  విప్, ఆలేరు ఎమ్మెల్యే గా భరత్ , ఎం. పీ.గా శ్రీరాం,విద్యా కమిషనర్ గా శ్రీవాణి, కలెక్టర్ గా నందిని, అడిషనల్ కలెక్టర్ గా  సమ్రీ న్, జెడ్పీ చైర్మన్ గాయత్రి, ఆర్జేడీ గా మనోజ్, డీఈఓ గా అమృత ఇలా పలువురు విద్యార్థులు వివిధ అధికార పాత్రలను పోషించారు. ఉపాధ్యాయులుగా చరణ్, లాస్య, హరిప్రియ, వెంకటేష్, నవ్య, వరుణ్, రేచల్ , ఉమేష్, సంజయ్, అర్చన, మేఘన, భవాని, హారిక, శ్రీశాంత్, కిరణ్ కుమార్, కన్నా, దీపిక, అక్షర తదితరులు పాల్గొన్నారు. అధికారులుగా, ఉపాధ్యాయులుగా పాత్రలు పోషించిన విద్యార్థులను అభినందిస్తూ పాఠశాల ప్రధానోపాధ్యాయులు దాసరి మంజుల బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -