Monday, March 9, 2026
E-PAPER
Homeఆదిలాబాద్పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈఓ

పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈఓ

- Advertisement -

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి
నవతెలంగాణ – కుభీర్
విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నాణ్యత తో కూడిన భోజనాన్ని అందించేలా చూడాలని మండల విద్యాధికారి సూచించారు. సోమవారం మండలంలోని రంజిని,రంజిని తండా గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా  తనిఖీ చేశారు. ఈ సందర్బంగా మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నాణ్యత తో కూడిన భోజనాన్ని అందించేలా చూడలన్నారు. విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించేలా చూడలన్నారు.అదే విదంగా పాఠశాల తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలను  పరీక్షించారు. అనంతరం పాఠశాలలో పలు రికార్డులను , విద్యార్థుల హాజరు పట్టికలను  పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు తదితరులున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -