Monday, March 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పల్లె ప్రకృతి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్

పల్లె ప్రకృతి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్ 
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మండలంలోని అంతంపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న పల్లె ప్రకృతి వనాలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సోమవారం పరిశీలించారు. పల్లె ప్రకృతి వనంలో నాటిన మొక్కల పెరుగుదల, నిర్వహణ పనులను కలెక్టర్ సమీక్షించారు. పల్లె ప్రకృతి వనాల్లో నాటిన మొక్కలు బాగా పెరిగేలా ప్రతిరోజూ నీరు పోయడం, పిచ్చి మొక్కలను తొలగించడం, చుట్టూ శుభ్రత పాటించడం, క్రమం తప్పకుండా నిర్వహణ పనులు చేయడం ఎంతో ముఖ్యమని తెలిపారు.

మొక్కల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అవి చెట్లుగా ఎదిగే వరకు నిరంతరంగా పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు సూచించారు.అనంతరం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని కలెక్టర్ పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకుని ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని సూచించారు. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం సమయానికి పూర్తయ్యేలా చర్యలు తీసుకుని గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యలయంలో డీఎల్పీఓ శ్రీనివాస్, సర్పంచ్ మంజుల‌ సంజీవరెడ్డి, స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -